పెళ్లికి ముందే ప్రెగ్నెన్సీ.. తప్పేంటి అంటున్న హీరోయిన్స్

by  |
పెళ్లికి ముందే ప్రెగ్నెన్సీ.. తప్పేంటి అంటున్న హీరోయిన్స్
X

దిశ, ఫీచర్స్: పెళ్లి జీవితంలో ఓ కీలక ఘట్టం. ఇది కాస్త పూర్తి అయితే అందరూ అడిగే ప్రశ్న.. పిల్లలను ప్లాన్ చేస్తున్నారా? లేదా? ఇంకెంత టైమ్ తీసుకుంటారు? లేట్ అయిపోతుంది కదా? అని తొందరపెడుతుంటారు. కానీ ఇదే తొందర పెళ్లికి ముందు పడితే నానా బూతులు తిట్టేస్తారు. భారతీయ సంప్రదాయం, సమాజపు కట్టుబాట్లు అంటూ లెక్చర్స్ ఇచ్చేస్తారు. కానీ ఇవేవి పట్టించుకోకుండా ఫారిన్ కల్చర్‌ను ఫాలో అవుతున్న సెలబ్రిటీలు.. ఇండియాలోనూ ఇదే కల్చర్‌ను నార్మలైజ్ చేస్తున్నారు. ఇద్దరి మధ్య నమ్మకముంటే డేటింగ్, మ్యారేజ్‌కు ముందే పిల్లలు తప్పు కాదు అనే వాదనతో ముందుకు సాగుతున్నారు. అలాంటి కొందరు సెలబ్రిటీలు లైఫ్‌లో ఫెయిల్ లేదా సక్సెస్ అయి సమాజానికి మెసేజ్ ఇస్తున్న వెల్‌నోన్ సెలబ్రిటీల లిస్ట్ చూసేద్దాం.

భారతీయ సమాజం వివాహ జీవితం, శోభనం లాంటి వాటికి పెద్దపీఠ వేసింది. అమ్మాయి అమ్మగా మారే ప్రక్రియను చాలా పవిత్రంగా చూస్తోంది. ఓ వారసుడిని/వారసురాలిని తీసుకొస్తుందంటే ఆ రెండు కుటుంబాలు పెద్ద పండుగను జరుపుకుంటాయి. అంటే పెళ్లి తర్వాతే తల్లి కావాలనేది భారతీయ కట్టుబాటు. కానీ ప్రజెంట్ జనరేషన్‌లో డేటింగ్, లివింగ్ రిలేషన్ షిప్స్‌ పుణ్యమా అని.. పెళ్లికి, తల్లి కావడానికి అసలు సంబంధమే లేకుండా పోయింది. ఫిజికల్ రిలేషన్‌షిప్, పెళ్లికి ముందే పిల్లలు అనే కాన్సెప్ట్‌తో ఎంజాయ్ చేస్తున్నారు. ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీ ఫ్యామిలీస్‌లో ఇలాంటి ఫ్రీడమ్ ఎక్కువైపోయిందని.. స్వేచ్ఛ, ఆధునికి జీవన శైలిని కోరుకోవడమే ఇందుకు కారణమని అభిప్రాయపడుతున్నారు సంప్రదాయవాదులు.

శ్రీదేవి..

అతిలోక సుందరి శ్రీదేవి గురించి కొత్తగా పరిచయం అవసరం లేదు. అప్పటికే పెళ్లై ఇద్దరు పిల్లలున్న బాలీవుడ్ బిజినెస్ మెన్ బోనీ కపూర్‌తో ప్రేమలో పడిన శ్రీదేవి.. పెళ్లికి ముందే ఏడు నెలల గర్బవతి అంటూ ప్రచారం జరిగింది. ఈ విషయాన్ని శ్రీదేవి, బోనీ అధికారికంగా ప్రకటించకపోయినా… వివాహం జరిగిన మూడు నెలల్లోనే జాన్వీ కపూర్‌కు జన్మించింది.

సారిక..

తమిళ సినిమాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న సారిక.. 1980 దశకంలో కమల్ హాసన్‌తో ప్రేమయాణం సాగించింది. సహజీవనం అనే కాన్సెప్ట్ ఇండియాలో వినిపించకముందే.. వీరిద్దరూ డేటింగ్ చేయడమనేది అప్పట్లో సంచలనమే. ఈ క్రమంలోనే గర్భం దాల్చిన సారిక పెళ్లికి ముందే శృతిహాసన్‌కు జన్మనిచ్చింది. దీంతో ఈ అన్‌అఫిషియల్ రిలేషన్‌ను అఫిషియల్‌గా మార్చేందుకు కమల్ మొదటి భార్య వాణి గణపతికి విడాకులచ్చి సారికను పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. కాగా తల్లిని ఫాలో అవుతూ తను కూడా పెళ్లికి ముందే ప్రెగ్నెన్సీని ఎంజాయ్ చేస్తానంటున్న శృతి.. రూమర్డ్ బాయ్ ఫ్రెండ్ శంతను హజారికాతో ప్రస్తుతం కలిసే ఉంటోంది.

రేణు దేశాయ్..

ముంబై నుంచి తెలుగు ఇండస్ట్రీకి వచ్చిన మరాఠి నటి రేణుదేశాయ్. ‘బద్రి’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయింది. ఈ టైమ్‌లోనే పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ – రేణు దేశాయ్ మధ్య ప్రేమ చిగురించగా.. ‘జానీ’ సినిమా టైమ్ వరకు సహజీవనం ప్రారంభించేశారు. ఈ క్రమంలోనే వివాహానికి ముందే అకీరాకు జన్మనిచ్చింది రేణు దేశాయ్. దీంతో 2009లో పవన్‌ రేణూను పెళ్లి చేసుకోగా.. వీరి పెళ్లి సమయానికి అకీరా వయసు ఏడాదిపైనే ఉండటం విశేషం. కానీ ఆ తర్వాత రెండేళ్లకే అంటే 2011లో వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు.

అమృత అరోరా..

‘గబ్బర్ సింగ్’ సినిమాలో కెవ్వు కేక పాటకు డాన్స్ చేసిన మలైకా అరోరా సోదరి అమృత అరోరా ప్రెగ్నెన్సీ విషయం బాలీవుడ్‌లో సంచలనం రేపింది. ఎవరితో రిలేషన్ షిప్‌లో ఉంది? ఆ గర్భానికి కారణమెవరు? అనే విషయం టాక్ ఆఫ్ ది టౌన్ అయిపోయింది. బిడ్డకు జన్మనిచ్చిన తర్వాతే బిజినెస్‌మన్ షకీల్ లడక్ పాపకు తండ్రి అని ప్రకటించింది ముద్దుగుమ్మ. దీంతో ఈ సస్పెన్స్‌కు తెరపడగా… ఏ హడావుడి, ఆర్భాటం లేకుండా వివాహం చేసుకున్న ఈ జంట కొద్దికాలానికే విడిపోయారు.

సెలీనా జైట్లీ..

బాలీవుడ్ హీరోయిన్, మాజీ మిస్ ఇండియా సెలీనా జైట్లీ.. ఆస్ట్రేలియాకు చెందిన వ్యాపారవేత్త పీటర్ హగ్‌ను ప్రేమించింది. అంతేకాదు పెళ్లికి ముందే గర్భందాల్చి కవలలకు జన్మనిచ్చిన సెలీనా.. 2011 జూలైలో తన బాయ్ ఫ్రెండ్ పీటర్ హాగ్‌ను పెళ్లి చేసుకుంది.

నేహా ధూపియా..

ప్రముఖ బాలీవుడ్ నటి ధూపియా అంగద్ బేడీతో ప్రేమయాణం కొనసాగుతుండగానే గర్భం దాల్చింది. దీంతో తల్లిదండ్రులకు చెప్పేందుకు భయపడి రహస్యంగానే వివాహం చేసుకున్న ఈ జంట.. ప్రస్తుతం హ్యాపీగానే ఉన్నారు.

నీనా గుప్తా..

ఇండిపెండింట్‌గా జీవించాలనుకున్న సీనియర్ హీరోయిన్ నీనా గుప్తా.. పెళ్లి అనే తంతు లేకుండానే పిల్లలు కనాలనుకుంది. వెస్టిండీస్ క్రికెటర్ వివియన్ రిచర్డ్స్‌‌ ఫీచర్స్‌తో ఓ బిడ్డకు జన్మనివ్వాలనుకున్న ఆమె.. తనను అప్రోచ్ అయింది. ఈ క్రమంలో ఆయనతో డేటింగ్ చేసిన నీనా… మ్యారేజ్‌కు ముందే మసాబా గుప్తాకు జన్మనిచ్చింది. ఆ తర్వాత ఆమె లైఫ్‌లో మ్యారేజ్‌, రిలేషన్‌షిప్స్ ఓ సినిమా లెవల్‌లో వస్తూ వెళ్తూనే ఉన్నాయి. ఈ రహస్య బంధాల సమాహారాన్ని ఓ పుస్తకం రూపంలో తీసుకొచ్చిన నీనా.. తను చేసిన తప్పులు మరొకరు చేయకూడదని హెచ్చరిస్తుంది.

కొంకణా సేన్ శర్మ..

బాలీవుడ్ క్రేజీ హీరోయిన్ కొంకణా సేన్ శర్మ కూడా పెళ్లికి ముందు ప్రెగ్నెన్సీ కల్చర్‌ను ఫాలో అయిపోయింది. మ్యారేజ్‌కు ముందే మూడు నెలల గర్భవతి అయిన తను.. నటుడు రణ్‌వీర్ శౌరీతో పెళ్లి తర్వాత ఆరునెలలకు బిడ్డకు జన్మినిచ్చింది.

వీణా మాలిక్..

పాకిస్థాన్ క్రికెటర్‌తో ప్రేమయాణం కొనసాగించిన వీణా మాలిక్. కొంత కాలానికి అతన్ని వదిలేసి దుబాయ్‌కు చెందిన వ్యాపార వేత్తను 2013‌లో పెళ్లి చేసుకుంది. అయితే పెళ్లినాటికే ఈ బ్యూటీ గర్భవతి కావడం విశేషం.

మహిమా చౌదరి..

శ్రీకాంత్, జగపతిబాబు లాంటి హీరోలతో తెలుగు సినిమాలు చేసిన మహిమా చౌదరి కూడా పెళ్లికి ముందే ఓ పాపకు జన్మనిచ్చింది. ఆ తర్వాత తన ప్రేమికుడు బాబీ ముఖర్జీని 2006లో రహస్యంగా వివాహం చేసుకుంది.

హార్థిక్ పాండ్య..

క్రికెట్ మైదానంలో సిక్స్‌లతో విరుచుకుపడే టీమ్ ఇండియా ఆల్ రౌండర్ హార్థిక్ పాండ్య.. మిగతా విషయాల్లోనూ దూకుడు‌గానే ఉంటాడు. నటి నటాషా‌తో ప్రేమాయణం సాగించిన హార్థిక్.. పెళ్లి కాకుండానే తండ్రి అయ్యాడు. బాబు పుట్టిన తర్వాత నటాషాను పెళ్లి చేసుకున్నాడు.

అమీ జాక్సన్..

ఈ బ్రిటీష్ భామ జార్జ్ పనైటౌ అనే వ్యాపారవేత్తతో చాలా కాలం ప్రేమలో మునిగితేలింది. ఈ క్రమంలోనే వీరిద్దరికి ఎంగేజ్మెంట్ జరిగినా ఆ బంధం పెళ్లి పీటలవరకు వెళ్లలేదు. అంటే ఈ భామ కూడా మ్యారేజ్‌కు ముందే పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. కొడుకు పుట్టి రెండేళ్లు అవుతున్నా.. ఇంకా పెళ్లి చేసుకోని అమీ డేటింగ్‌ను ఎంజాయ్ చేస్తూనే ఉంది.

పెళ్లికి ముందే గర్భం తప్పా?

బాలీవుడ్ నటి కల్కి కోచ్లిన్ దర్శకుడు అనురాగ్ కశ్యప్‌ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. అయితే కొద్దికాలానికే అతనితో విడాకులు తీసుకుని, హర్షతో ప్రేమలో పడిన ఈ భామ.. పెళ్లికి ముందే ఒక బిడ్డకు తల్లి అయింది. అయితే “పెళ్లికి ముందే పిల్లల్ని కనడం అంటే తప్పు చేసినట్లుగా ఈ సమాజం చూస్తోంది. కేవలం ఎవరో వ్యక్తుల కోసం మన పద్ధతులు, పనులు మార్చుకోవాల్సిన అవసరం లేదు. నేటి యువతులు, నటులు తమ ప్రెగ్నెన్సీ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. కనేవారికి ఇబ్బంది లేనప్పుడు.. చూసే వాళ్లకు ఏం ఇబ్బంది? పెళ్లి చేసుకుంటేనే గర్భం దాల్చాలనే రూల్ ఏమీ లేదు. నచ్చిన జీవితాన్ని గడపడం తప్పేమీ కాదు” అని అభిప్రాయపడింది.

యుగోవ్ సర్వే ప్రకారం..

పెళ్లి కాని జంటలు రతిలో పాల్గొనడం సరైనది కాదని అనేకమంది సలహాలు ఇస్తుంటారు. కానీ సెక్స్ గురించి భారతీయ యువత ఏమనుకుంటుంది? అని ఆన్‌లైన్ మార్కెట్ రీసెర్చ్ అనలిటిక్స్ సంస్థ యుగోవ్ సర్వే నిర్వహించగా.. “నగరాల్లో జీవించే పది మంది భారతీయుల్లో ముగ్గురు వివాహేతర లైంగిక ఆలోచనకు తెరతీస్తున్నారని, తూర్పు-ఉత్తర భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో వివాహానికి ముందు తమ భాగస్వాములతో లైంగిక సంభంధం కలిగి ఉండటానికి 60 శాతం అంగీకరిస్తే.. దక్షిణ భారతదేశంలో మాత్రం 16 శాతం మంది అంగీకరిస్తున్నట్లు తేలింది. ఇక శృగారంపై చర్చలో పాల్గొన్న 47 శాతం మంది పురుషులు, 32 శాతం మంది స్త్రీలు వ్యక్తిగత విషయంగా సెక్స్ చేయడానికి హద్దులు అవసరంలేదు అంటున్నారని” యుగోవ్ తెలిపింది.

అయితే ఈ నయా కల్చర్‌ను ఫాలో అయితే పార్ట్‌నర్స్ ఇద్దరూ ఎంజాయ్ చేస్తున్నారని పైకి కనిపిస్తున్నా.. చాలా కేసుల్లో పిల్లలను కన్న తర్వాత మాత్రం ఆ భారం కేవలం అమ్మాయిలే మోయాల్సిన పరిస్థితి ఏర్పడుతుందనేది వాస్తవం. అందుకే నీనా గుప్తా లాంటి సెలబ్రిటీలు అమ్మాయిలు తస్మాత్ జాగ్రత్త అని హెచ్చరిస్తూనే ఉన్నారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed