బాంబే హైకోర్టులో ‘రెడ్’ హీరోయిన్

by  |
బాంబే హైకోర్టులో ‘రెడ్’ హీరోయిన్
X

దిశ, వెబ్‌డెస్క్: చాలా మంది స్టార్స్ తమకు నచ్చిన చదువులు చదువుతూనే సినిమాల్లో రాణిస్తున్నారు. అనుకోకుండా సినిమాల్లోకి వచ్చి క్లిక్ అయినా సరే, చదువును మధ్యలో ఆపేయకుండా కంటిన్యూ చేస్తుంటారు. అందుకు బెస్ట్ ఎగ్జాంపుల్‌గా సాయి పల్లవిని చెప్పొచ్చు. ఆమె ఓవైపు వెండితెరపై మెరుస్తూనే ఎంబీబీఎస్ కంప్లీట్ చేసేసింది. తాజాగా ఈ కోవలోనే మరో యంగ్ హీరోయిన్ చేరింది. ‘నేల టిక్కెట్టు’ సినిమాతో టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చిన మాళవికా శర్మ.. ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని ‘రెడ్’ సినిమాలో కీలక పాత్రలో కనిపించబోతుంది. ఇలా స్టార్స్ సరసన హీరోయిన్ చాన్స్‌లు కొట్టేస్తూనే తనకు నచ్చిన విధంగా లాయర్ కూడా అయిపోయింది. మహారాష్ట్ర, గోవా బార్ కౌన్సిల్‌లో మెంబర్‌షిప్ కూడా సంపాదించిన భామ.. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది. ‘మీ డ్రీమ్స్‌ను ఫాలో అవండి.. మీకు ఆత్మసంతృప్తి కలిగించే పనులు చేసేందుకు భయపడకండి.. ధైర్యంగా ముందుకు సాగితే మీ కలలు తప్పక నిజమవుతాయి’ అంటూ బాంబే హైకోర్టులో అడ్వకేట్‌గా తన ఐడీ కార్డ్ షేర్ చేసింది మాళవికా శర్మ.

Next Story

Most Viewed