పెళ్లికి ముందే బిడ్డకు జన్మనిచ్చి కాబోయే భర్తను వదిలేసిన స్టార్ హీరోయిన్

by  |
పెళ్లికి ముందే బిడ్డకు జన్మనిచ్చి కాబోయే భర్తను వదిలేసిన స్టార్ హీరోయిన్
X

దిశ, వెబ్‌డెస్క్: ‘మద్రాసు పట్నం’ చిత్రంతో చిత్ర పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చి.. ‘ఐ’ సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకుంది బ్రిటిష్ నటి, మోడల్ అమీ జాక్సన్. అమ్మడు నటించినవి కొన్ని చిత్రాలే అయినా ఆమె అందం, అభినయానికి కుర్రకారు ఫిదా అయిపోయారు. ఇక అమీ పెళ్లి కాకుండానే తల్లి అయ్యి సంచలనం సృష్టించింది. తన ప్రియుడుతో గర్భవతిగా ఉన్నపుడే నిశ్చితార్థం చేసుకొని టాక్ అఫ్ ది ఇండస్ట్రీగా మారింది. ఇక తాజాగా అమీ జాక్సన్ ప్రియుడితో విడిపోయిందన్న వార్తలు నెట్టింట వైరల్ గా మారాయి.

వివరాలలోకి వెళితే.. అమీ జాక్సన్‌, జార్జ్‌ పనాయిటో ఎన్నో ఏళ్లుగా ప్రేమించుకుంటున్నారు. పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారు. 2019 లో వీరి నిశ్చితార్థం జరిగింది. అప్పటికే అమీ జాక్సన్ ప్రగ్నెంట్ గా ఉంది. ఇంతలో కరోనా మొదలవడం, పెళ్లి వాయిదా పడడం జరిగాయి. ఈ నేపథ్యంలోనే అమీ గతేడాది సెప్టెంబర్ లో పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఎప్పుడూ సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉండే అమీ ముద్దుల కొడుకు , ప్రియుడు ఫోటోలను షేర్ చేస్తూ ఉండేది. అయితే ఏమైందో ఏమో తెలియదు కానీ అమీ సడన్ గా ప్రియుడు ఫోటోలను సోషల్ మీడియా నుంచి డిలీట్ చేసింది. దీంతో ప్రియుడితో అమీ తెగదెంపులు చేసుకుందేమో అనే వార్తలు గుప్పుమన్నాయి. ఉన్నట్లుండి ఇలా పిక్స్‌ డిలీట్‌ చేయడం చూస్తుంటే వీరు విడిపోయారని, ఇక వీరి పెళ్లి జరగడం కష్టమేనని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. మరి ఈ విషయమై అమీ ఎలా స్పందిస్తుందో చూడాలి.

Next Story

Most Viewed