- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వాట్సాప్‌లో ‘ఫేక్’ విజయ్ దేవరకొండ
<p>దిశ, హైదరాబాద్ వాట్సాప్‌లో నకిలీ విజయ్ దేవరకొండ హల్‌చల్ చేస్తున్నాడు. హిరో విజయ్ సాయి దేవరకొండ పేరుతో ఫేక్ ఫ్రొఫైల్ సృష్టించి యువతులకు గాలెం వేస్తున్నాడు.ఒక్కరు కాదు ఇద్దరు కాదు..అతని మాయమాటలకు ఇప్పటివరకూ చాలా మంది అమ్మాయిలు చిక్కుకున్నట్టు తెలుస్తోంది. తమతో చాటింగ్ చేసేది నిజమైన హిరో విజయ్ అనుకుని యువతులు ఫుల్ సంబరపడిపోతున్నారని సమాచారం. కాగా, విషయం ఆ నోటా ఈ నోటా హిరో విజయ్ చెవిన పడటంతో ఆయన ఒక్కసారిగా షాక్ అయినట్టు తెలుస్తోంది. […]</p>

దిశ, హైదరాబాద్
వాట్సాప్‌లో నకిలీ విజయ్ దేవరకొండ హల్‌చల్ చేస్తున్నాడు. హిరో విజయ్ సాయి దేవరకొండ పేరుతో ఫేక్ ఫ్రొఫైల్ సృష్టించి యువతులకు గాలెం వేస్తున్నాడు.ఒక్కరు కాదు ఇద్దరు కాదు..అతని మాయమాటలకు ఇప్పటివరకూ చాలా మంది అమ్మాయిలు చిక్కుకున్నట్టు తెలుస్తోంది. తమతో చాటింగ్ చేసేది నిజమైన హిరో విజయ్ అనుకుని యువతులు ఫుల్ సంబరపడిపోతున్నారని సమాచారం. కాగా, విషయం ఆ నోటా ఈ నోటా హిరో విజయ్ చెవిన పడటంతో ఆయన ఒక్కసారిగా షాక్ అయినట్టు తెలుస్తోంది. అసలే మనోడికి కొంచెం కోపం ఎక్కువయే. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్ అర్జున్ రెడ్డి తన మేనేజర్ సాయంతో అచ్చం అమ్మాయిలాగా నకిలీ విజయ్‌తో చాటింగ్ చేశాడు. ఆ మెసేజ్ హిస్టరీని అంతా తీసుకుని బుధవారం సైబర్ క్రైమ్ పోలీసులు ముందు పెట్టారు. హిరో విజయ్‌కు చెడ్డపేరు తీసుకువచ్చేలా అమ్మాయిలతో మెసేజ్ చేస్తున్నవ్యక్తిపై చర్యలు తీసుకోవాలని సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ నకిలీ వాట్సాప్ అకౌంట్‌ను ఎవరు ఆపరేట్ చేస్తున్నారో కనిపెట్టే పనిలో నిమగ్నమైనట్టు తెలిపారు.
tags ; fake whatsapp profile, name as hero vijay devarakonda, cyber crime police






