'రాధే శ్యామ్' అప్ డేట్: రిలీజ్ డేట్ రివీల్ చేసిన ప్రభాస్

by  |
రాధే శ్యామ్ అప్ డేట్:  రిలీజ్ డేట్ రివీల్ చేసిన ప్రభాస్
X

దిశ, వెబ్‌డెస్క్: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన అప్ డేట్ వచ్చేసింది. కొన్ని రోజులు టాలీవుడ్ స్టార్ హీరోల కొత్త సినిమాల అప్ డేట్ రావడంతో డార్లింగ్ ఫ్యాన్స్ తమకూ అప్డేట్ కావాలని సోషల్ మీడియా లో రచ్చ చేసిన విషయం తెలిసిందే. ఇక తాజగా అభిమానుల కోరిక మేరకు మేకర్స్ ఎట్టకేలకు భారీ అప్డేట్ నే రివీల్ చేశారు. ‘సాహో’ చిత్రం తర్వాత ప్రభాస్ నటిస్తున్న పాన్ ఇండియా చిత్రాల్లో ‘రాధే శ్యామ్’ ఒకటి. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ప్రభాస్ సరసన పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది.

శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాపై ప్రభాస్ ఫ్యాన్స్ భారీ అంచనాలనే పెట్టుకున్నారు. ఇక ఇప్పటికే ‘రాధే శ్యామ్’ నుంచి విడుదలైన పోస్టర్స్, ఫస్ట్ గ్లింప్స్ నెట్టింట వైరల్ గా మారాయి. ఎప్పటినుంచో ఈ సినిమా సమ్మర్ బరిలో నిలవనుందంటూ వార్తలు వచ్చినా.. చివరకు ప్రభాస్ కూడా సంక్రాంతి రేసులో దిగుతున్నట్లు కన్ఫర్మ్ చేసేశారు. ఏకకాలంలో ఐదు భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది.

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ తన సోషల్ మీడియాలో ఈ చిత్రం రిలీజ్ తేదీతో పోస్టర్ ను పంచుకున్నారు. ఇక పోస్టర్ లో యూరోప్ వీధుల్లో నడుస్తూ చాలా స్టైలిష్ గా కనిపించాడు. ” నా రొమాంటిక్ సాగా ‘రాధేశ్యామ్’ కొత్త విడుదల తేదీ కోసం మీరంతా వేచి చూస్తున్నారని తెలుసు.. ఇది 14 జనవరి 2022న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతుంది” అంటూ ప్రభాస్ తెలిపారు. 1980లలో యూరప్ నేపథ్యంలో సాగే రొమాంటిక్ లవ్ స్టోరీగా ఈ సినిమాను దర్శకుడు తెరకెక్కిస్తున్నాడు. ఇక ఈ సినిమా టైమ్ ట్రావెల్ నేపథ్యంలో నడుస్తుందని, ప్రతీ సన్నివేశం ఆద్యంతం ఆసక్తికరంగా ట్విస్టులతో ఎంతో అద్బుతంగా ఉంటుందని సమాచారం. మరి ఈ సినీరంతో డార్లింగ్ మరో హిట్ ని తన ఖాతాలో వేసుకుంటారేమో చూడాలి.


Next Story