మెగాస్టార్ కన్నా ముందే సీఎం జగన్ తో మంచు మనోజ్ భేటీ.. ఆ రిలేషనే కారణమా..?

by  |
మెగాస్టార్ కన్నా ముందే సీఎం జగన్ తో మంచు మనోజ్ భేటీ.. ఆ రిలేషనే కారణమా..?
X

దిశ, ఏపీ బ్యూరో: హీరో మంచు మనోజ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌తో భేటీ అయ్యారు. అమరావతిలో వైఎస్ జగన్ ను మనోజ్ కలవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇటీవల తెలుగు సినీపరిశ్రమ సమస్యలపై చర్చించేందుకు సినీపెద్దల్ని సీఎం జగన్ ఆహ్వానించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవితో పాటు ఏడుగురు సభ్యులు జగన్ ని కలవడానికి ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఇక ఈ క్రమంలోనే చిరు కన్నా మనోజ్ ముందే సీఎం జగన్ ని కలవడం సర్వత్రా ఆసక్తి నెలకొంది. సీఎం జగన్‌ను కలిసిన విషయాన్నీ మనోజ్ ట్విటర్ వేదికగా తెలియజేశాడు. ఈ సందర్భంగా సీఎం జగన్‌పై ప్రశంసలు కురిపించారు. వైఎస్ జగన్ మంచి పరిపాలన అందిస్తున్నారని కితాబిచ్చారు.

“సీఎం జగన్‌కు ఎంతో దూరదృష్టి ఉందని..అలాంటి వ్యక్తిని కలవడం గౌరవంగా ఉందన్నారు. రాబోయే రోజుల్లో చేపట్టబోతున్న పనులపై సీఎంను అడిగి తెలుసుకున్నట్లు వివరించారు. ‘సార్ మీరు అనుకున్న అన్ని పనులను నిర్విఘ్నంగా పూర్తి చేసే శక్తిని ఆ భగవంతుడు మీకు ఇవ్వాలని కోరుకుంటున్నా'” అంటూ మనోజ్ ట్వీట్ చేశారు. ఇకపోతే ఈ భేటీ ఇండస్ట్రీలో కలకలం రేపుతోంది. ఇండస్ట్రీ పెద్దలను కలవడానికి తీరిక లేని జగన్ మంచు మనోజ్ ని ఎలా కలిశాడు అనేది అంతుచిక్కని ప్రశ్నగా మారింది. అయితే ఈ భేటీ జస్ట్ క్యాజువల్ గా జరిగిందా..? లేక దీని వెనుక ఏమైనా కారణం ఉందా..? అనేది తెలియాల్సి ఉంది. అయితే వైయస్ జగన్మోహన్ రెడ్డితో మంచు కుటుంబానికి ఉన్న రిలేషన్ షిప్ నేపథ్యంలోనే మనోజ్ కి ఈ అవకాశం లభించిందని కొందరు భావిస్తున్నారు.



Next Story