- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రభాస్ ‘ఆదిపురుష్’లో డ్రీమ్ గర్ల్
by Jakkula Samataha |
<p>దిశ, వెబ్‌డెస్క్: రెబల్ స్టార్ ప్రభాస్ చేయబోయే భారీ ప్రాజెక్ట్స్‌లో ‘ఆదిపురుష్’ ఒకటి. దాదాపు రూ.500 కోట్ల బడ్జెట్, హై టెక్నికల్ వాల్యూస్‌తో తెరకెక్కుతున్న సినిమాకు బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకులు. ప్రభాస్ రాముడి పాత్రలో కనిపించబోతుండగా… రావణుడిగా సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్న సినిమాలో సీత, లక్ష్మణుడి పాత్రల గురించి నెట్టింట చర్చ జరిగింది. ఎవరు ఫైనల్ అయ్యారనే విషయంలో ఇంకా క్లారిటీ రాకపోయినా..తాజాగా డ్రీమ్ గర్ల్ హేమ మాలిని ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్ […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: రెబల్ స్టార్ ప్రభాస్ చేయబోయే భారీ ప్రాజెక్ట్స్‌లో ‘ఆదిపురుష్’ ఒకటి. దాదాపు రూ.500 కోట్ల బడ్జెట్, హై టెక్నికల్ వాల్యూస్‌తో తెరకెక్కుతున్న సినిమాకు బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకులు. ప్రభాస్ రాముడి పాత్రలో కనిపించబోతుండగా… రావణుడిగా సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్న సినిమాలో సీత, లక్ష్మణుడి పాత్రల గురించి నెట్టింట చర్చ జరిగింది. ఎవరు ఫైనల్ అయ్యారనే విషయంలో ఇంకా క్లారిటీ రాకపోయినా..తాజాగా డ్రీమ్ గర్ల్ హేమ మాలిని ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్ చేస్తోందని బీ టౌన్ టాక్. కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న ఆమె..మేకర్స్ అత్యంత కీలక పాత్ర ఆఫర్ చేయడంతోనే ఇందుకు ఒప్పుకున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. కొద్దిరోజులుగా రాజకీయాల్లో బిజీగా ఉన్న హేమ మాలిని..ఇప్పుడు మళ్లీ తెరపై కనిపించనుందనే టాక్‌తో ఫ్యాన్స్ ఖుష్ అవుతున్నారు.
Next Story






