దాతల సహకారం మరువలేనిది: మంత్రి జగదీశ్ రెడ్డి

by  |
దాతల సహకారం మరువలేనిది: మంత్రి జగదీశ్ రెడ్డి
X

దిశ, నల్లగొండ: లాక్‌డౌన్ నేపథ్యంలో ఉపాధి కోల్పోయిన పేదలను ఆదుకోవడానికి ముందుకొచ్చిన దాతల సహకారం మరువలేనిదని విద్యత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం సూర్యాపేట మున్సిపల్ పరిధిలో టీఆర్ఎస్ నాయకులు, కుల సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు పేదలకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి మంత్రి జగదీశ్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కరోనా వ్యాప్తి నివారణకు విధించిన లాక్ డౌన్ వల్ల దేశవ్యాప్తంగా పేదలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రభుత్వానికి చేయూతగా పలువురు దాతలు ముందుకు వచ్చి నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం శుభపరిణామమన్నారు. ఇప్పటికే ప్రభుత్వం తరఫున జిల్లావ్యాప్తంగా ఇతర రాష్ట్రాలకు చెందిన లక్ష మంది వలస కార్మికులకు నిత్యావసర వస్తువులు అందించామన్నారు. మున్సిపల్ చైర్మన్ అన్నపూర్ణ, వైస్ చైర్మన్ పుట్టా కిశోర్, కమిషనర్ రామాంజులరెడ్డి, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ గోపగాని, ఇతర అధికారులు పాల్గొన్నారు.

tags: minister jagadish reddy, corona, lockdown, necessities supply, help never forgettable

Next Story

Most Viewed