అలర్ట్.. తొమ్మిది జిల్లాలకు భారీ వర్ష సూచన

by  |
rainfall
X

దిశ, వెబ్‌డెస్క్ : ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రానున్న 48 గంటల్లో తమిళనాడులోని తొమ్మిది జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని చెన్నై వాతావరణ కేంద్రం ఓ ప్రకటనలో పేర్కొంది. ఇప్పటికే సేలం, ధర్మపురి, కళ్లకురిచ్చి, తిరువణ్ణామలై, రాణిపేట, వేలూరు, తేని, దిండుగల్‌, మదురై, తిరుపత్తూర్‌, కోయంబత్తూర్‌, ఈరోడ్‌, విల్లుపురం, కడలూరు జిల్లాల్లో శనివారం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. ఇక, తిరువళ్లూర్‌, కాంచీపురం, చెంగల్పట్టు జిల్లాల్లో మరో 48 గంటలు భారీ వర్షం కురిసే అవకాశముందని వాతావరణ శాఖ ప్రకటించింది.

ఉపరితల ఆవర్తనం కారణంగా అటు ఏపీలో సైతం వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. ఉత్తర అరేబియా సముద్ర ప్రాంతంలో జాలర్లు చేపల వేటకు వెళ్లరాదని ప్రాంతీయ వాతావరణ కేంద్రం డైరెక్టర్‌ పువిఅరసన్‌ హెచ్చరికలు జారీచేశారు.



Next Story

Most Viewed