- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రైతుకు కన్నీరే మిగిల్చిన వరుణుడు
by Sridhar Babu |
<p>దిశ,హుజురాబాద్: రైతుల ఆశలు మరోసారి ఆవిరయ్యాయి. మంగళవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి చేతికి వచ్చిన పంట నేలపాలైంది. అకాల వర్షంతో రైతాంగానికి అపార నష్టం వాటిల్లింది. ఆరుగాలం శ్రమించిన రైతాంగానికి చివరికి కన్నీరే మిగిలింది. ఒక్కసారిగా అన్నదాత కుదేలైపోయాడు. హుజురాబాద్ డివిజన్ ప్రాంతంలో రాత్రి భారీ వర్షానికి కోతకు వచ్చిన పంట నేలవాలింది. అకాల వర్షంతో పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది. దీంతో సుమారు 5వేల ఎకరాల్లోని పంట నేలపాలైనట్లు రైతు సంఘాలు ఆవేదన వ్యక్తం […]</p>

X
దిశ,హుజురాబాద్: రైతుల ఆశలు మరోసారి ఆవిరయ్యాయి. మంగళవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి చేతికి వచ్చిన పంట నేలపాలైంది. అకాల వర్షంతో రైతాంగానికి అపార నష్టం వాటిల్లింది. ఆరుగాలం శ్రమించిన రైతాంగానికి చివరికి కన్నీరే మిగిలింది. ఒక్కసారిగా అన్నదాత కుదేలైపోయాడు.

హుజురాబాద్ డివిజన్ ప్రాంతంలో రాత్రి భారీ వర్షానికి కోతకు వచ్చిన పంట నేలవాలింది. అకాల వర్షంతో పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది. దీంతో సుమారు 5వేల ఎకరాల్లోని పంట నేలపాలైనట్లు రైతు సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. హుజురాబాద్ డివిజన్ లోని హుజురాబాద్, జమ్మికుంట, వీణవంక, ఇల్లందకుంట, శంకరపట్నం, సైదాపూర్ మండలాల్లో వరి పంటలు చాలా వరకు నేలకొరిగాయి. రోడ్లపై, వ్యవసాయ మార్కెట్లో పోసిన ధాన్యం, రైతులు కోసిన ఆరబెట్టిన ధాన్యం తడిసి ముద్దయింది.
Next Story






