భారీగా బంగారం పట్టివేత

9

దిశ, వెబ్‌డెస్క్: చెన్నై విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టుబడింది. దుబాయ్ నుంచి చెన్నై విమానాశ్రయానికి వచ్చిన ప్రయాణికుడి నుంచి ఈ బంగారం స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన 765 గ్రాముల బంగారం విలువ దాదాపు రూ.40 లక్షలు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. అనంతరం నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.