కొమురంభీం జిల్లాలో వరద బీభత్సం.. 9 మంది కార్మికులు జల దిగ్బంధం

by Chintha Aamani |

<p>దిశ, వెబ్‌డెస్క్: కొమురంభీం అసిఫాబాద్ జిల్లాలో వరద బీభత్సం సృష్టించింది. జిల్లాలోని పెద్దవాగు పొంగడంతో తొమ్మిదిమంది కార్మికులు జలదిగ్భంధంలో చిక్కుకున్నారు. స్థానికుల సాయంతో సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. కాగా, గతకొద్ది రోజులుగా ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలకు రాష్ట్రవ్యాప్తంగా వాగులు, వంకలు, ప్రాజెక్టులు అన్నీ పొంగి పొర్లుతున్నాయి. ఇళ్లలోకి వరదనీరు చేరి జలమయమయ్యాయి. వరదనీరు కారణంగా రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి.</p>

Heavy Floods
X

దిశ, వెబ్‌డెస్క్: కొమురంభీం అసిఫాబాద్ జిల్లాలో వరద బీభత్సం సృష్టించింది. జిల్లాలోని పెద్దవాగు పొంగడంతో తొమ్మిదిమంది కార్మికులు జలదిగ్భంధంలో చిక్కుకున్నారు. స్థానికుల సాయంతో సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. కాగా, గతకొద్ది రోజులుగా ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలకు రాష్ట్రవ్యాప్తంగా వాగులు, వంకలు, ప్రాజెక్టులు అన్నీ పొంగి పొర్లుతున్నాయి. ఇళ్లలోకి వరదనీరు చేరి జలమయమయ్యాయి. వరదనీరు కారణంగా రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి.

Next Story