- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నిద్రలేమి సమస్యతో బాధపడేవారిలో ఆడవాళ్లే ఎక్కువ.. సర్వేల్లో కీలక విషయాలు వెల్లడి
ప్రతి మనిషికి మంచి ఆహారంతో పాటు సరైన నిద్ర అవసరం.

దిశ, వెబ్ డెస్క్: ప్రతి మనిషికి మంచి ఆహారంతో పాటు సరైన నిద్ర (Sleep) అవసరం. కానీ, ప్రస్తుత రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా నిద్రలేమి (Insomnia) సమస్యతో బాధపడేవారు చాలా మంది ఉంటున్నారు. అందుకు అనేక కారణాలున్నాయి. నిద్రలేమితో బాధపడేవాళ్లలో ఆత్మవిశ్వాసం లోపించడం, డిప్రెషన్, ఆందోళన, కోపం, అతిగా తినడం, గందరగోళం.. వంటి లక్షణాలు కనిపిస్తుంటాయి. అయితే, ఈ నిద్రలేమి సమస్య ఆడవారిలో ఎక్కువగా ఉన్నట్లు తాజాగా అధ్యయనంలో తేలింది.
గ్లోబల్ హెల్త్ టెక్నాలజీ కంపెనీ రెస్‌మెడ్ నిద్రపై తాజాగా ఒక సర్వేను విడుదల చేసింది. ఈ సర్వే ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది సరైన నిద్ర లేకపోవడం అనే సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. అంతేకాదు, పురుషుల కంటే స్త్రీలే నిద్ర సమస్యలతో ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారని సర్వే వెల్లడించింది. సగటున పురుషులు వారానికి 4.13 రోజులు సరిగ్గా నిద్రపోగలుగుతున్నారని, కానీ మహిళలు వారంలో 3.83 రోజులు మాత్రమే సరిగ్గా నిద్రపోగలుగుతున్నారని తెలిపింది.
రోజంతా అనేక పనుల్లో బిజీగా ఉండే మహిళలకు సాధారణంగా పురుషుల కన్నా ఎక్కువ, ఆరోగ్యకరమైన మంచి నిద్ర అవసరం. అయితే, ఉద్యోగం చేసే మహిళల్లో ఇంటి పని, ఆఫీసు వర్క్ కారణంగా సరైన నిద్ర ఉండటం లేదని తాజా అధ్యయనంలో తేలింది. అలాగే, చాలామంది స్త్రీలు పీరియడ్స్ సమయంలో ఈ నిద్రలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. గర్భధారణ సమయంలో హార్మోన్ల మార్పుల కారణంగా స్త్రీలు నిద్రపోయే సమయం, నిద్రపోయే విధానంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తేలింది.
ఇక ప్రపంచవ్యాప్తంగా కేవలం 29 శాతం ప్రజలు మాత్రమే వారానికి మూడు రోజులు లేదా అంతకంటే ఎక్కువ సార్లు సరిగ్గా నిద్రపోలేకపోతున్నారు. 34 శాతం నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారని సర్వేలో తేలింది. 57 శాతం మంది ఒత్తిడి, 46 శాతం మంది ఆందోళన, 31 శాతం మంది ఆర్థికపరమైన ఒత్తిళ్ల కారణంగా నిద్రసమస్యలు ఎదుర్కోకున్నట్లు వివరించింది. ఈ నిద్రలేమి బాధితుల సంఖ్య అమెరికా, జపాన్, సింగపూర్‌లలో 33 శాతం ఉండగా ఆస్ట్రేలియాలో 41 శాతం ఉంది. భారత్‌లో 69 శాతం, సింగపూర్‌లో 65 శాతం, థాయిలాండ్‌లో 65 శాతం, దక్షిణ కొరియాలో 67 శాతం ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు.






