కాలేయానికి ముప్పు..! ఈ మూడు అలవాట్లే కారణమా?

by B.Srinivas |   (  Updated:2026-01-19 12:36:34  IST  )

మూడు బలమైన కారణాల వల్లే వారానికొక నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీలివర్ పేషెంట్ పుట్టుకొస్తున్నారని వైద్యుల సర్వేలో వెల్లడైంది.

కాలేయానికి ముప్పు..! ఈ మూడు అలవాట్లే కారణమా?
X

దిశ, ఫీచర్స్: ఫ్యాటీ లివర్ డిసీజ్ ప్రపంచ మానవాళికి అదిపెద్ద ముప్పుగా మారింది. ముఖ్యంగా దక్షిణాసియాలో నాన్-ఆల్కహాలిక్స్ ‘జెన్-జీ’ అధికంగా ఫ్యాటీ లివర్ వ్యాధుల బారినపడటం ఆందోళన కలిగిస్తోంది. మారుతున్న లైఫ్ స్టైల్‌కు అనుగుణంగా సౌత్ ఏసియన్లు జీవన శైలీలో మార్పులు చేసుకోలేకపోతున్నారని, మూడు బలమైన కారణాల వల్లే వారానికొక ఫ్యాటీలివర్ పేషెంట్ పుట్టుకొస్తున్నారని వరల్డ్ వైడ్‌గా వైద్యులు ఇటీవల చేపట్టిన సర్వేలో వెల్లడైంది. దక్షిణాసియాలో వారానికొకరు ఫ్యాటీ లివర్ బారినపడుతుండగా.. ఇక్కడి స్త్రీ-పురుషుల జీవనశైలి విధానాలు ఒకేలా ఉన్నాయని, ఈ ముప్పును ఎదుర్కొంటున్నవారిలో మూడు రెగ్యూలర్ అలవాట్లను గుర్తించినట్లు వెల్లడించారు.

లేట్ నైట్ డిన్నర్..
నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ వ్యాధిని స్టీటోటిక్ లివర్ డిసీజ్ (MASLD) అని కూడా అంటారు. నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ (NAFLD) కేవలం ఆల్కహాల్ సేవించడం వల్లనే రాదు. ఫుడ్ హ్యాబిట్స్ వల్ల కాలేయంలో అధిక కొవ్వు పేరుకుపోయి ఈ వ్యాధి సంభవిస్తుంది. దక్షిణాసియా ప్రజల్లో ఫ్యాటీలివర్ వ్యాధికి అర్ధరాత్రులు డిన్నర్ లేదా అల్పాహారం తీసుకోవడం మెయిన్ రీజన్. లేట్ నైట్ పార్టీలు, ఫంక్షన్స్, నైట్ షిఫ్ట్ ఉద్యోగాల కారణాలతో ఎప్పుడుపడితే అప్పుడే ఏదో ఒకటి తినేయడం, భోజనం చేసిన తర్వాత అది డైజేషన్‌ అయ్యేంతవరకు విరామం ఇవ్వకపోవడం కూడా ఒక ప్రధాన కారణమే. ఫుడ్ మాత్రమే కాదు టీ, కాఫీ, కూల్ డ్రింక్స్, స్నాక్స్ వంటివి కూడా జీర్ణక్రియ వ్యవస్థను దెబ్బతిసి ఫ్యాటీ లివర్ డిసీస్ కు కారణమవుతున్నాయని వైద్యులు చెబుతున్నారు.

ప్రోటీన్స్ లేని బ్రేక్ ఫాస్ట్..
ప్రోటీన్లు లేని అల్పాహారం తీసుకోవడం మరొక సమస్య. ఇడ్లీ, దోశ, పూరీ, సమోసా వంటివాటిలో కార్బొహైడ్రేట్లు అధికంగా ఉంటున్నాయి. రీఫైన్డ్ ఆయిల్‌, రీఫైన్డ్ కార్బొహైడ్రేట్లు, మైదా వంటి వాటిని చాలా మంది తింటున్నారు. ఇవ‌న్నీ ఫ్యాటీ లివర్ వ్యాధితోపాటు డ‌యాబెటిస్‌ను తెచ్చి పెడుతున్నాయి. ఇక కాఫీ, టీలు తేలికైనవే అయినప్పటికీ అందులో ఉండే యాంటీఆక్సిడెంట్లు, మెగ్నీషియం వంటి అనేక ఇతర బయోయాక్టివ్ సమ్మేళనాలు కొందరిలో షుగర్ లెవల్స్‌ను పెంచుతాయి. దీని ఫలితంగా తినాలనే కోరిక పుడుతుంది.

ఇమ్యూనిటీ పవర్..
మన బాడీలో ఇమ్యూనిటీ పవర్ లేకపోతే ఇన్సులిన్ సెన్సిటివిటీ తగ్గిపోతుంది. రెసిస్టెన్స్ ట్రైనింగ్ లేకపోతే అది ఎప్పటికీ మెరుగుపడదు. కొవ్వు కాలేయంతో బాధపడుతున్న సగటు దక్షిణాసియన్లు ఎలాంటి రెసిస్టెన్స్ ట్రైనింగ్ తీసుకోరని, రోజుకు 12 నుండి 14 గంటలు డెస్క్ వద్ద కూర్చోవడంతో కార్డియో సమస్యల బారినపడుతున్నట్లు వైద్యులు తెలిపారు. జీవక్రియ ఆరోగ్యానికి ఏది ముఖ్యమో తెలుసుకోవట్లేదని, ఒకవేళ తెలిసిన దానిని పాటించేందుకు సాహసం చేయట్లేదని చెప్పారు. మనం తినే ఆహారంలో 30నుంచి40 శాతం ప్రోటీన్, ఫైబర్ తప్పనిసరిగా చేర్చుకోవాలి. ఇలా ప్రయత్నించి చూస్తే 3 రోజుల్లో జీర్ణక్రియ వ్యవస్థలో మార్పులు కనిపిస్తాయని సూచించారు.

ఫ్యాటీ లివర్ లక్షణాలు..
రోజులో ఎక్కువశాతం అలసిపోయినట్లు, అనారోగ్యంగా అనిపిస్తుంది. కాలేయ నొప్పి లేదా ఉదరంలో అసౌకర్యంగా ఉంటుంది. పొత్తికడుపు వాపు, చర్మంపై దురద, పసుపు రంగులో మూత్రవిసర్జన, కళ్ళు, అరచేతులు ఎర్రబారటం, వికారం, బలహీనత మొదలైనవి కాలేయ వ్యాధుల లక్షణాలు. అల్ట్రాసౌండ్‌ స్కానింగ్‌ ద్వారా ఫ్యాటీ లివర్‌ను గుర్తించవచ్చు. రక్తపరీక్షల్లో ఎమ్మార్‌ ఎలాస్టోగ్రఫీ, ఫైబ్రో స్కాన్‌ మొదలైన అధునాత పద్ధతుల ద్వారా కాలేయం పనితీరును పరీక్షిస్తారు. కాలేయం పనితీరును బట్టి ఎఫ్‌ 0 నుంచి ఎఫ్‌ 4 వరకూ స్కోరింగ్‌ ఇస్తారు. ఈ పరీక్షల్లో ఎఫ్‌4 ఫలితం వస్తే వాళ్లు మూడో దశకు చేరుకున్నట్టు. మూడో దశను లివర్‌ ఫైబ్రోసిస్‌ అంటారు. లివర్‌ ఫైబ్రోసిస్‌ చాలా ప్రమాదకరం. నాలుగో దశలను సిరోసిస్‌ అంటారు. ఈ దశలో కాలేయం పూర్తిగా చెడిపోతుంది. ఈ దశకు చేరుకున్నవాళ్లు 20 నుంచి 30 శాతం వరకూ చనిపోయే ప్రమాదం ఉంది.

చికిత్స ఉందా!
ఆరోగ్యకరమైన, సమతుల్య ఆహారం తీసుకోవడంతోపాటు వారానికి కనీసం 150 నిమిషాలు వ్యాయామం చేయాలి. అధిక బరువుతో ఉంటే మద్యం, సిగరేట్ తొగొద్దు. మొదటి దశలో ఉన్నవాళ్లు మందులు వాడటం కన్నా క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల ఈ సమస్యను అధిగమించవచ్చు. వీళ్లు యాంటీ ఆక్సిడెంట్స్‌ పుష్కలంగ తీసుకోవాలి. తీపి పదార్థాలు, నూనెతో చేసిన పదార్థాలు తినడం తగ్గించుకోవాలి. రెండో దశకు చేరుకున్న వాళ్లు పై జాగ్రత్తలు తీసుకుంటూ వైద్యుల సలహా మేరకు మందులు వాడాలి. మూడు నాలుగు దశల వారికి తప్పని సరిగా మందులు వాడాల్సిందే. అయితే కొందరికి కాలేయం పూర్తిగా చెడిపోతుంది. అలాటప్పుడు మరో కాలేయాన్ని అమర్చాల్సి ఉంటుంది.

Next Story