పిల్లలకు కల్లు తాగించొద్దు..

by Sujitha Rachapalli |

పిల్లలకు కల్లు తాగించొద్దని హెచ్చరిస్తున్న నిపుణులు.. ఫిట్స్, లివర్ డ్యామేజ్, అడిక్షన్‌తోపాటు తీవ్ర పరిణామాలు ఉంటాయని వార్నింగ్..

పిల్లలకు కల్లు తాగించొద్దు..
X

దిశ, ఫీచర్స్ : సాధారణంగా ఆరు నెలల వరకు పిల్లలకు నీరు కూడా తాగించొద్దు.. తల్లిపాలు చాలు అని చెప్తుంటారు డాక్టర్లు. కానీ పల్లెటూళ్లలో చాలా మంది దీన్ని లైట్‌గా తీసుకుంటారు. నీళ్లు ఏం ఖర్మా ఏకంగా కల్లు కూడా తాగిస్తరు. దీనివల్ల ఏదైనా జబ్బు ఉంటే తగ్గుతుందనే భ్రమలో ఉంటరు. కానీ ఇలాంటి పని చేస్తే చిన్నారులకు చాలా తీవ్రమైన అనారోగ్య సమస్యలు వస్తాయని హెచ్చరిస్తున్నారు నిపుణులు. ముఖ్యంగా ముఖ్యంగా పీడియాట్రిషియన్లు ఈ పద్ధతిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇది ప్రేమతో చేసే పనిగా అనిపించినా, శాస్త్రీయంగా చాలా ప్రమాదకరమని.. కల్లు (తాటి లేదా ఈత చెట్టు నుంచి తీసే కల్లు)లో ఆల్కహాల్ (ఎథనాల్) ఉంటుందని చెప్తున్నారు. తాజా కల్లులో సాధారణంగా 4% లేదా అంతకంటే ఎక్కువ ఆల్కహాల్ ఉంటుంది. అలాగే కాసేపు ఉంచితే ఫెర్మెంటేషన్ వల్ల మరింత పెరుగుతుంది. ఇది బీర్‌తో సమానమైన ఆల్కహాల్ శాతం కలిగి ఉంటుంది.

మెదడు అభివృద్ధిని దెబ్బతీస్తుంది..

పిల్లల మెదడు ముఖ్యంగా 0-18 ఏళ్ల వరకు ఇంకా పూర్తిగా అభివృద్ధి చెందదు. అలాంటి సమయంలో కల్లు తాగిస్తే.. ఈ ఆల్కహాల్ న్యూరాన్లు, సినాప్స్‌లను దెబ్బతీసి, ఇంటెలిజెన్స్, మెమరీ, లెర్నింగ్ సామర్థ్యం, బిహేవియర్‌పై దీర్ఘకాలిక నష్టం కలిగిస్తుంది. అమెరికన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ (AAP) వంటి సంస్థలు ఆల్కహాల్ వాడకాన్ని పూర్తిగా నిషేధిస్తాయి.

హైపోగ్లైసీమియా (రక్తంలో షుగర్ తగ్గిపోవడం)

కల్లు తాగితే చిన్న పిల్లల్లో రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు హఠాత్తుగా పడిపోతాయి. దీనివల్ల హైపోగ్లైసీమిక్ సీజర్స్ (ఫిట్స్ / మూర్ఛలు) వస్తాయి. ఇది ప్రాణాంతకం కావచ్చు. చాలా మంది పిడియాట్రీషియన్స్ ఇలాంటి కేసుల గురించి బహిరంగంగా చర్చిస్తున్నారు. హెచ్చరిస్తున్నారు.

లివర్ ఫెయిల్యూర్

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో చాలా సార్లు కల్లులో ఆల్ప్రాజోలం (Xanax), డయాజెపామ్ వంటి సెడేటివ్స్ (నిద్ర మందులు) కలిపి అమ్ముతారు. ఇవి ఆల్కహాల్ టాక్సిసిటీని మరింత పెంచుతాయి. పిల్లలకు ఇచ్చినప్పుడు అడిక్షన్ పెరుగుతుంది. వణుకు, ఆందోళన, ఫిట్స్ వంటివి వస్తాయి. గర్భిణీలు తాగితే ఫీటస్‌లో లివర్, లిపిడ్ మెటబాలిజం దెబ్బతింటుందని అధ్యయనాలు చూపిస్తున్నాయి. పిల్లల్లో కూడా లివర్ ఫెయిల్యూర్ లాంటి ఎఫెక్ట్స్ ఉంటాయి. కారణం ఆల్కహాల్, కెమికల్స్‌ను డైజెస్ట్ చేసేంత మెచ్యూరిటీ చిన్నారుల లివర్‌కు ఉండదు. అందుకే పండేళ్ల వరకు పిల్లలకు కల్లు తాగించొద్దని సూచిస్తున్నారు.

Next Story