క్యాన్సర్‌ను గుర్తిస్తున్న పీరియడ్ ప్యాడ్..

by Sujitha Rachapalli |

సాధారణంగా పీరియడ్ బ్లడ్‌ను వ్యర్థంగా భావిస్తాం. కానీ ఈ వేస్టేజ్‌ను బెస్ట్‌ పర్పస్‌లో వినియోగించారు ఈటీహెచ్ జూరిచ్ పరిశోధకులు. శానిటరీ ప్యాడ్‌లో పేపర్ బేస్డ్ లాటర్ ప్లో అస్సేను యాడ్ చేయడం ద్వారా.. ఆరోగ్య సమస్యల గురించి తెలుసుకోవడం ముందే సాధ్యమవుతుందన్నారు

క్యాన్సర్‌ను గుర్తిస్తున్న పీరియడ్ ప్యాడ్..
X

దిశ, వెబ్ డెస్క్: సాధారణంగా పీరియడ్ బ్లడ్‌ను వ్యర్థంగా భావిస్తాం. కానీ ఈ వేస్టేజ్‌ను బెస్ట్‌ పర్పస్‌లో వినియోగించారు ఈటీహెచ్ జూరిచ్ పరిశోధకులు. శానిటరీ ప్యాడ్‌లో పేపర్ బేస్డ్ లాటర్ ప్లో అస్సేను యాడ్ చేయడం ద్వారా.. ఆరోగ్య సమస్యల గురించి తెలుసుకోవడం ముందే సాధ్యమవుతుందన్నారు. సీపీఆర్ ద్వారా శరీరంలో నొప్పి, వాపు, మంటను గుర్తిస్తుందని.. కార్సిరోఎంబ్రియోనిక్ ఆంటిజెన్ ద్వారా ఓవరియన్, గైనకాలజీ క్యాన్సర్లు, ఎండోమెట్రియోసిస్ గుర్తించవచ్చన్నారు. పీరియడ్ బ్లడ్ పడగానే ప్యాడ్‌ రంగులో కలిగే మార్పుల ద్వారా భవిష్యత్తులో ఎలాంటి రోగాలు రాబోతున్నాయో గుర్తించవచ్చని తెలిపారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ ఇంకా డెవలప్మెంట్ స్టేజ్‌లో ఉండగా.. క్లారిటీ చెక్ చేసేందుకు పెద్ద ఎత్తున అధ్యయనాలు చేయాల్సి ఉంటుంది.

Next Story