రోజంతా ఏసీ గదుల్లో ఉండేవారికి షాకింగ్ న్యూస్.. ఎంత ప్రమాదమో తెలుసా?

by Naga Rani Yarlagadda |

వాతావరణం వేడిగా ఉన్నా, వర్షం పడుతున్నా, చలిగా ఉన్నా... కొంతమందికి ఎయిర్ కండిషనర్ తప్పదు. ఆఫీసుల్లో, షాపుల్లో, ఇళ్లలో – ఏసీ కింద గంటల తరబడి కూర్చోవడం నిత్యవ్యవహారమే అయ్యింది.

రోజంతా ఏసీ గదుల్లో ఉండేవారికి షాకింగ్ న్యూస్.. ఎంత ప్రమాదమో తెలుసా?
X

దిశ, వెబ్‌డెస్క్: వాతావరణం వేడిగా ఉన్నా, వర్షం పడుతున్నా, చలిగా ఉన్నా... కొంతమందికి ఎయిర్ కండిషనర్ తప్పదు. ఆఫీసుల్లో, షాపుల్లో, ఇళ్లలో – ఏసీ కింద గంటల తరబడి కూర్చోవడం నిత్యవ్యవహారమే అయ్యింది. కానీ ఇలా నిరంతరం ఏసీలో ఉండటం వల్ల శరీరానికి, ముఖ్యంగా ఎముకల ఆరోగ్యానికి తీవ్ర ప్రభావం పడుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. తక్కువ ఉష్ణోగ్రతలో గడిపే సమయం పెరిగితే, శరీరంలో జీవక్రియలు మందగించటం ప్రారంభమవుతుంది.

ఫలితంగా ఎముకలకు రక్తప్రసరణ తగ్గుతుంది. అవసరమైన పోషకాలు సరైన మోతాదులో చేరవు. దీర్ఘకాలంగా ఇలా కొనసాగితే ఎముకలు బలహీనపడతాయి. కీళ్ల నొప్పులు, చలికి స్పందన పెరుగుతుంది. ఈ లక్షణాలు ముఖ్యంగా ఎక్కువసేపు ఏసీలో పనిచేసే ఉద్యోగులు, లేదా ఇంట్లో ఎక్కువసేపు ఏసీ గదిలో ఉండే వారు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది.

ఎక్కువ సమయం ఏసీలో ఉండేవారు ఒక గంటకొకసారి బయటకు వెళ్లి నడవడం అలవాటు చేస్కోవాలి. ఏసీ ఉష్ణోగ్రత 24°C - 26°C మధ్యలో ఉంచడం, విటమిన్ D కోసం రోజులో కొన్ని నిమిషాలు వెలుతురులో గడపడం, సాధారణ ఫ్యాన్ వాతావరణంలో కొన్ని గంటలు ఉండే అలవాటు చేసుకోవడం, వైద్యుల సలహాతో క్యాల్షియం, విటమిన్ D వంటి పోషకాలు తీసుకోవడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలి.

Next Story