పురుషుల్లో ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్.. దేనికి సంకేతం!

by Sujitha Rachapalli |

గర్భధారణ సమయంలో స్త్రీల శరీరంలో హ్యూమన్ కొరియానిక్ గోనడోట్రోపిన్(hCG) హార్మోన్ ఉత్పత్తి అవుతుంది. దీనివల్ల ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్‌గా వస్తుంది. సాధారణంగా పురుషుల్లో ఈ హార్మోన్ ఉండదు. కాబట్టి ప్రెగ్నెన్సీ టెస్ట్ నెగెటివ్‌గానే ఉంటుంది.

పురుషుల్లో ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్.. దేనికి సంకేతం!
X

దిశ, వెబ్ డెస్క్: గర్భధారణ సమయంలో స్త్రీల శరీరంలో హ్యూమన్ కొరియానిక్ గోనడోట్రోపిన్(hCG) హార్మోన్ ఉత్పత్తి అవుతుంది. దీనివల్ల ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్‌గా వస్తుంది. సాధారణంగా పురుషుల్లో ఈ హార్మోన్ ఉండదు. కాబట్టి ప్రెగ్నెన్సీ టెస్ట్ నెగెటివ్‌గానే ఉంటుంది. ఒకవేళ పాజిటివ్ వచ్చిందంటే కొన్ని రకాల అనారోగ్య పరిస్థితులు ఉన్నట్లే. ముఖ్యంగా క్యాన్సర్ ఉన్నట్లు హెచ్చరిస్తున్నారు నిపుణులు. అవును.. ముఖ్యంగా టెస్టిక్యులర్ క్యాన్సర్, ట్యూమర్స్ ఉన్నప్పుడు hCG లెవల్స్ పెరుగుతాయి. దీనివల్ల ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ వస్తుంది. హార్మోనల్ ఇంబ్యాలెన్స్, ఎండోక్రైన్ డిజార్డర్స్ కూడా ఈ హార్మోన్ లాంటి పదార్థాలను ప్రొడ్యూస్ చేయవచ్చని చెప్తున్నారు ఎక్స్‌పర్ట్స్.

మరోవైపు hCG ఇంజక్షన్లు, ఫెర్టిలిటీ ట్రీట్మెంట్‌కు వినియోగించే మందులు కూడా ఈ హార్మోన్ స్థాయిలను పెంచుతాయి. కొన్నిసార్లు ప్రెగ్నెన్సీ కిట్స్ లోపం కూడా ఇందుకు కారణంగా ఉంటుంది. యూరిన్‌లో బ్లడ్, ప్రోటీన్, ఇతర పదార్థాలు కూడా టెస్ట్ రిజల్ట్‌కు కారణం కావచ్చు. కాబట్టి ఒకవేళ పురుషులు ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకుని.. పాజిటివ్ రిజల్ట్ వచ్చినట్లయితే వెంటనే డాక్టర్‌ దగ్గరకు వెళ్లడం మంచిదని సూచిస్తున్నారు నిపుణులు.

Next Story