- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Cough Syrup Effects: డాక్టర్లు, ఫార్మసిస్టులకు కేంద్రం కీలక సూచనలు
పిల్లలకు దగ్గు సిరప్(Cough Syrup)ల వినియోగం విషయంలో జాగ్రత్తలు అవసరమని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ (డీజీ హెచ్ ఎస్) మరోసారి స్పష్టం చేసింది.

దిశ, వెబ్‌డెస్క్: పిల్లలకు దగ్గు సిరప్(Cough Syrup)ల వినియోగం విషయంలో జాగ్రత్తలు అవసరమని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ (డీజీ హెచ్ ఎస్) మరోసారి స్పష్టం చేసింది. పిల్లల్లో వచ్చే ఎక్కువ శాతం దగ్గు వ్యాధులు తక్కువ కాలంలో తానే తగ్గిపోతాయని, వాటికి ప్రత్యేకంగా మందుల అవసరం ఉండదని వైద్య నిపుణులు చెబుతున్నారని మంత్రిత్వ శాఖ(Union Health Ministry) గుర్తుచేసింది.
రెండు సంవత్సరాల లోపు చిన్నారులకు దగ్గు, జలుబు మందులు ఇవ్వకూడదని, ఐదు సంవత్సరాల లోపు పిల్లల్లో కూడా వీటి వాడకం తగ్గించాలని అధికారులు సూచించారు. అలాంటి సందర్భాల్లో వైద్యుల పర్యవేక్షణలోనే తగిన మోతాదులు, తక్కువ వ్యవధి పాటు మాత్రమే మందులు ఇవ్వాలని, ఒకేసారి ఒక్క మందు మాత్రమే వాడాలని సలహా ఇచ్చారు. దగ్గు తగ్గించడంలో ముందుగా ప్రయత్నించాల్సినవి ఔషధేతర మార్గాలేనని – అంటే తగినంత నీరు తాగించడం, విశ్రాంతి ఇవ్వడం, సహాయక చర్యలు చేపట్టడమే మొదటి ప్రాధాన్యంగా ఉండాలని సూచనల్లో పేర్కొన్నారు.
మరోవైపు, దగ్గు సిరప్‌లు వంటి ఉత్పత్తులు మంచి నాణ్యతతో, ఫార్మాస్యూటికల్ గ్రేడ్ పదార్థాలతో, గుడ్ మాన్యుఫాక్చరింగ్ ప్రాక్టీసెస్ ప్రకారం తయారవ్వాల్సిన అవసరముందని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. అలాగే ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులలో పనిచేసే వైద్యులు, ఫార్మసిస్టులు ఈ సూచనలపై జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు. ఈ మేరకు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ఆరోగ్య శాఖలు అన్ని ఆసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, జిల్లా వైద్య సంస్థలకు ఈ సూచనలను చేరవేయాలని డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ డా. సునీతా శర్మ స్పష్టం చేశారు.






