Viral News:ఐడియా అదిరింది.. నిద్రలేమి సమస్యకు వెరైటీ చికిత్స!

by Jakkula.Mamatha |   (  Updated:2025-05-29 13:12:13  IST  )

మనిషి జీవితంలో అత్యంత ముఖ్యమైనది ఏంటంటే మంచి ఆరోగ్యం.

Viral News:ఐడియా అదిరింది.. నిద్రలేమి సమస్యకు వెరైటీ చికిత్స!
X

దిశ,వెబ్‌డెస్క్: మనిషి జీవితంలో అత్యంత ముఖ్యమైనది ఏంటంటే మంచి ఆరోగ్యం. ఆరోగ్యంగా ఉంటే.. మనం మన పనులను సులభంగా చేసుకోవచ్చు. అనుకున్న లక్ష్యాలను సాధించగలుగుతారు. ఆరోగ్యం అనేది మనిషి జీవితంలో అనేక అంశాలను ప్రభావితం చేస్తుందనడంలో ఆశ్చర్యం లేదు. ఆరోగ్యకరమైన జీవితం సంతోషాన్నిస్తుంది.

అయితే.. మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే నిద్ర చాలా ముఖ్యం. ఈ క్రమంలో రోజువారీ దినచర్యలో తగినంత నిద్ర ఉండాలి. నిద్రపోవడం వలన శారీరక అలసట తగ్గి ఉత్సాహంగా ఉంటుంది. ఈ క్రమంలో మంచి నిద్ర ఆరోగ్యంపై కూడా సానుకూల ప్రభావాన్ని చూపుతుంది. కానీ ఇటీవల చాలా మంది నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారు అని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. చాలా మందిని వేధిస్తున్న ఈ నిద్రలేమి సమస్యకు చైనాలో వినూత్నంగా చికిత్స అందిస్తున్నారు.

చైనాలో వినూత్న ట్రీట్‌మెంట్..

నిద్రలేమి సమస్యతో బాధపడుతున్న వారికి చైనాలోని షెన్‌యాంగ్ నగరంలో వెరైటీ విధానంలోట్రీట్‌మెంట్ ఇస్తున్నారు. ఈ చికిత్సలో భాగంగా ప్రజలు తమ మెడకు ఓ బెల్టు కట్టుకుని, కొద్దిసేపు నెమ్మదిగా గాలిలో ఊగుతారు. ఈ పద్ధతి వెనుక ఉన్న శాస్త్రీయ ఆధారం పై ఎలాంటి స్పష్టత లేదని నిపుణులు చెబుతున్నారు. కానీ ఈ చికిత్స నిద్రలేమి సమస్యలను గణనీయంగా తగ్గించాయని ఈ పద్ధతిని ప్రయత్నించినవారు చెబుతున్నారు. అయితే శాస్త్రీయ పద్ధతిలో ఈ విధానం పై ఎలాంటి స్పష్టత లేదు కాబట్టి.. నిద్రలేమి సమస్యతో బాధపడే వారు వైద్యులను సంప్రదించి చికిత్స తీసుకోవడం ఉత్తమం.

నోట్: పైన తెలిపిన సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించింది మాత్రమే. దీనిని ‘దిశ‘ ధృవీకరించలేదు. ఏమైనా సందేహాలు ఉంటే వైద్యులను సంప్రదించగలరు.

Next Story