- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పిల్లల్లో దాగిన ఆకలి.. గుండె జబ్బులకు కారణమవుతుందా?
ఆహారం అంటే కేవలం కడుపు నింపడం మాత్రమే కాదు. మానసిక, శారీరక ఎదుగుదలకు అవసరం. అయితే కొందరు తల్లిదండ్రులు పిల్లలకు ప్రాసెస్డ్ ఫుడ్ ఇవ్వడం కారణంగా కనిపించని పోషకాహార లోపం తలెత్తుతుంది.

దిశ, ఫీచర్స్ : చాలా మంది పిల్లలు ఆరోగ్యంగా, హ్యాపీగా కనిపిస్తారు. కానీ వారిలో హిడెన్ హంగర్.. అంటే ‘దాగిన ఆకలి’ ఉందని నిపుణులు చెప్తున్నారు. దీన్ని ఒక రకమైన పోషకాహార లోపంగా హెచ్చరిస్తున్నారు. చిన్నారులు బాగా తిన్నట్లు, బరువు పెరిగినట్లు ఉంటారు. కానీ వారి శరీరానికి అవసరమైన సూక్ష్మ పోషకాలైన విటమిన్స్, మినరల్స్ తక్కువగా అందుతాయి. ఇది స్పష్టంగా కనిపించని పోషకాహార లోపం. ఎక్కువగా ప్రాసెస్ చేసిన ఫుడ్స్ అంటే.. ఫాస్ట్ ఫుడ్, స్వీటెన్డ్ డ్రింక్స్, స్వీట్ సెరియల్స్, ప్యాక్ చేసిన స్నాక్స్, రెడీ టు ఈట్ మీల్స్.. ఇవన్నీ కూడా ఉప్పు, చక్కెర, అనారోగ్యకరమైన కొవ్వులు, కేలరీలను ఎక్కువగా కలిగి ఉంటాయి. కానీ విటమిన్స్, మినరల్స్, ఫైబర్ తక్కువగా ఉంటాయి. అయితే ఇవి టేస్టీగా ఉండటం కారణంగా పిల్లలు వీటిని పిక్ చేసుకుని మరీ తింటారు. పండ్లు, కూరగాయలు, ప్రోటీన్ ఫుడ్‌ను స్కిప్ చేస్తారు. కానీ పోషకాహారం అంటే కేవలం కడుపు నింపడం మాత్రమే కాదు పిల్లల శారీరక, మానసిక అభివృద్ధి, ఇమ్యూనిటీ, లెర్నింగ్‌కు అవసరమన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని హెచ్చరిస్తున్నారు నిపుణులు.
కారణాలు ఏమిటి?
అట్రాక్టింగ్‌గా ఉండే ప్యాకేజింగ్, కవర్లపైన కార్డూన్ క్యారెక్టర్లు, నేచురల్ అండ్ హెల్తీ అనే లేబుల్స్‌తో కూడిన మోసపూరితమైన యాడ్స్ జనాలను నమ్మించేస్తున్నాయి. పిల్లలు, పేరెంట్స్ ఆ ఫుడ్ ఎంచుకునేందుకు కారణమవుతున్నాయి. ముఖ్యంగా ఉద్యోగాలు చేసే తల్లిదండ్రుల బిజీ లైఫ్ స్టైల్.. వంట చేసే టైమ్ లేక.. స్కూల్‌కు టైంకు అందించాలనే గడువు.. ఇన్‌స్టాంట్‌గా ఇలాంటి ఫుడ్ ఇచ్చేందుకు ఇంకో రీజన్. తద్వారా సమతుల్య పోషకాలు అందకుండా చిన్నారులు ఇబ్బందులు పడుతున్నారు. దీనివల్ల పిల్లల్లో అలసట, ఏకాగ్రత లేకపోవడం, రోగనిరోధక శక్తి తగ్గం, డెవలప్మెంట్‌లో ఆలస్యం, బిహేవియరల్ ఇష్యూస్ తలెత్తుతున్నాయి. కొంత మందిలో టైప్ 2 డయాబెటిస్, గుండె జబ్బులు, ఆస్టియోపరోసిస్ వంటి దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాలు కూడా తలెత్తుతున్నాయి.
పేరెంట్స్ చేయాల్సిన పని..
* పండ్లు, కూరగాయలు, హోల్ గ్రెయిన్స్ (బ్రౌన్ రైస్, జొన్నలు వంటివి), లీన్ ప్రోటీన్స్ (మాంసం, చేపలు, గుడ్లు, బీన్స్), ఆరోగ్యకరమైన కొవ్వులను ఆహారంలో చేర్చాలి.
* ప్లేట్‌ను నేచురల్‌గా కలర్‌ఫుల్‌గా మార్చండి. ఎక్కువ విటమిన్లు, మినరల్స్ అందేలా చూడండి.
* ప్రాసెస్డ్ ఫుడ్స్ తగ్గించండి. షెల్ఫ్ లైఫ్ ఎక్కువ ఉంటే, పోషకాలు తక్కువ ఉంటాయన్న విషయం గుర్తుంచుకోండి.
* మీరే రోల్ మోడల్ అవ్వండి. తల్లిదండ్రులు ఆరోగ్యకరమైన ఆహారం తింటే పిల్లలు ఫాలో అయిపోతారు.






