ఉదయాన్నే ఇలా మొహం కడుగుతున్నారా? క్యాన్సర్ ముప్పుందట జాగ్రత్త!

by Ajay Maddhiboyina |

ప్ర‌తిఒక్క‌రూ ఉద‌యం లేచిన వెంట‌నే బ్ర‌ష్ చేస్తారు. అలా బ్ర‌ష్ చేసిన త‌ర‌వాత గొంతు శుభ్రంగా ఉండాల‌ని చేతిని నోట్లో పెట్టి గొంతులో ఉన్న‌ది అంతా బ‌య‌ట‌కు తీస్తారు. అది రాక‌పోయినా బ‌ల‌వంతంగా మ‌రీ పైకి తీసుకువ‌స్తారు. ఇంట్లో పెద్ద‌వాళ్లు అయితే చిన్న‌పిల్ల‌ల‌ను తిట్టి, కొట్టి మ‌రీ ఇలా చేపిస్తారు.

ఉదయాన్నే ఇలా మొహం కడుగుతున్నారా? క్యాన్సర్ ముప్పుందట జాగ్రత్త!
X

దిశ‌, వెబ్ డెస్క్: ప్ర‌తిఒక్క‌రూ ఉద‌యం లేచిన వెంట‌నే బ్ర‌ష్ చేస్తారు. అలా బ్ర‌ష్ చేసిన త‌ర‌వాత గొంతు శుభ్రంగా ఉండాల‌ని చేతిని నోట్లో పెట్టి గొంతులో ఉన్న‌ది అంతా బ‌య‌ట‌కు తీస్తారు. అది రాక‌పోయినా బ‌ల‌వంతంగా మ‌రీ పైకి తీసుకువ‌స్తారు. ఇంట్లో పెద్ద‌వాళ్లు అయితే చిన్న‌పిల్ల‌ల‌ను తిట్టి, కొట్టి మ‌రీ ఇలా చేపిస్తారు. అయితే ఇలా చేయ‌డం వ‌ల్ల క్యాన్స‌ర్ బారిన‌ప‌డే ప్ర‌మాదం ఉంద‌ని వైద్య నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు. సాధార‌ణంగా మ‌న గొంతు నుండి క‌డుపులోకి ఒక గొట్టం ఉంటుంది. దానినే (యూసోఫాగ్) అన్న‌వాహిక అంటారు. అన్న‌వాహిక గోడ‌లు చాలా సున్నితంగా ఉంటాయి. అన్న‌వాహిక గోడ‌ల‌పై నేల‌పై వేసే టైల్స్ మాదిరి క‌ణాలు ఉంటాయి.

అయితే ఉద‌యం మొహం క‌డిగేట‌ప్పుడు క‌డుపులో ఏమీ ఉండ‌దు కాబ‌ట్టి కేవ‌లం యాసిడ్ మాత్ర‌మే బ‌య‌ట‌కు వ‌స్తుంది. అలా వ‌చ్చే యాసిడ్ అన్న‌వాహిక క‌ణాలను దెబ్బ‌తీసే ప్ర‌మాదం ఉంది. దాని వ‌ల్ల ఆ క‌ణాలు తొల‌గిపోయి ఆ ప్ర‌దేశం ఎర్ర‌గా మారి గుండెలో మంట వ‌చ్చే ప్ర‌మాదం ఉంది. కొన్నాళ్లు అలాగే కొన‌సాగితే అన్న‌వాహిక‌పై క‌ణాలు ప‌నికిరాకుండా పోయి అక్క‌డ స్తంభాల మాదిరి క‌ణాలు ఏర్ప‌డ‌తాయి. కానీ ఆ క‌ణాల‌కు నిల‌క‌డ ఉండ‌దు.

ఇలా త‌ర‌చూ మార్పులు జ‌రిగితే అక్క‌డ క్యాన్స‌ర్ ఏర్ప‌డే ప్ర‌మాదం ఉంద‌ని నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు. ఇలా అవ్వ‌డం అరుదు అయిన‌ప్ప‌టికీ జ‌రిగే అవ‌కాశం ఉంద‌ని చెబుతున్నారు. అలా మోహం క‌డిగే వారు స్మోకింగ్ చేసినా, గుట్కాలు తిన్నా, మందు తాగినా రిస్క్ ఇంకా ఎక్కువై క్యాన్స‌ర్ వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని హెచ్చ‌రిస్తున్నారు. అంతే కాకుండా గొంతులో ఉండే మ్యూక‌స్ యాసిడ్ నుండి ర‌క్షిస్తుంది కాబ‌ట్టి త‌ర‌చూ దానిని బ‌య‌ట‌కు తీసే అవ‌సరం లేద‌ని చెబుతున్నారు.

Next Story