- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రాత్రి భోజనం వద్దు అంటున్న నిపుణులు..! నిజమెంత..? లాభనష్టాలు తెలుసుకోండి.
ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. దానికోసం ఆహారంలో, తినే వేళల్లో ఎన్నో మార్పులు చేస్తుంటారు.

దిశ, వెబ్ డెస్క్ : ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. దానికోసం ఆహారంలో, తినే వేళల్లో ఎన్నో మార్పులు చేస్తుంటారు. కొందరు బ్రేక్‌ఫాస్ట్ మానేస్తే బరువు తగ్గుతామని భావిస్తే, మరికొందరు లంచ్ చేయకపోతే ఫిట్‌గా ఉంటామనుకుంటారు. అయితే నిజంగా ఏ భోజనం మానెయ్యడం ఉత్తమం..? ఈ విషయంపై క్రీడాకారుడు మల్హర్ గన్లా కొన్ని ఆసక్తికరమైన విషయాలు చెప్పారు. ఆయన అభిప్రాయం ప్రకారం, ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌కు బదులు రాత్రి భోజనం మానేయడం మంచిది. ఇలా చేయడం వల్ల రోజంతా ఎక్కువగా తినాలనే కోరిక తగ్గుతుందని ఆయన అంటారు. రాత్రి భోజనం వదిలేయడం వల్ల క్యాలరీల వినియోగం తగ్గుతుంది, జీర్ణక్రియ కూడా మెరుగుపడుతుంది. అయితే, చాలామంది నిపుణులు మాత్రం గర్భిణులు, పిల్లలు, ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి ఇది సరైనది కాదని హెచ్చరిస్తున్నారు.
బ్రేక్‌ఫాస్ట్ మానేయడం వల్ల నీరసం, ఏకాగ్రత లేకపోవడం, అనారోగ్యకరమైన ఆహార ఎంపికలు చేసుకునే ప్రమాదం ఉంది. అదే రాత్రి భోజనం మానేస్తే, శరీరం డీహైడ్రేషన్‌కు గురయ్యే అవకాశం ఉంది, అలాగే మరుసటి రోజు ఎక్కువగా తినే ప్రమాదం కూడా లేకపోలేదు. మధ్యంతర ఉపవాసం చేసేవారు సరైన పద్ధతిలో రాత్రి భోజనం మానేయడం వల్ల కొంత ప్రయోజనం పొందవచ్చు. చాలామందికి ఉదయం టిఫిన్ లేదా రాత్రి భోజనం మానేసే అలవాటు ఉంటుంది. కానీ ఏ కారణం చేతైనా ఉదయం బ్రేక్‌ఫాస్ట్ మాత్రం మానెయ్యకూడదు. దానివల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు. రాత్రి భోజనం తర్వాత 8-10 గంటల పాటు కడుపు ఖాళీగా ఉంటే, రక్తంలో చక్కెర స్థాయి తగ్గుతుంది. కాబట్టి మధ్యాహ్న భోజనంలో మార్పులు చేసుకోవచ్చు. కానీ ఉదయం లేదా సాయంత్రం పూట తినే ఆహారంలో మార్పులు చేయకపోవడం మంచిది. ఎక్కువ క్యాలరీలు లేదా స్వీట్లు తినడం వల్ల ఎలాంటి తేడా ఉండదు. అందుకే ఉదయం పూట ప్రోటీన్లు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి.
మరి, బ్రేక్‌ఫాస్ట్ కంటే రాత్రి భోజనం మానేయడం నిజంగానే మంచిదా? ఢిల్లీలోని అపోలో స్పెక్ట్రా హాస్పిటల్‌కు చెందిన సీనియర్ న్యూట్రిషనిస్ట్ దివ్య మాలిక్ దీనిపై స్పందిస్తూ, ఉదయం బ్రేక్‌ఫాస్ట్ కంటే రాత్రి భోజనం మానేయడం వల్ల కొన్ని ప్రయోజనాలు ఉండొచ్చని, కానీ ఇది ఎక్కువగా వ్యక్తి జీవనశైలి, ఆరోగ్య పరిస్థితి, రోజువారీ దినచర్యపై ఆధారపడి ఉంటుందని అన్నారు. ఉదయం నిద్ర లేచిన తర్వాత జీవక్రియను ప్రారంభించడానికి, శరీరానికి అవసరమైన శక్తిని అందించడానికి బ్రేక్‌ఫాస్ట్ చాలా ముఖ్యం. అందుకే దీన్ని రోజులో ముఖ్యమైన భోజనంగా చెబుతారు. బ్రేక్‌ఫాస్ట్ మానేయడం వల్ల నీరసం, ఏకాగ్రత లోపించడం, రోజంతా ఎక్కువ ఆకలి వేయడం వంటి సమస్యలు తలెత్తవచ్చు. ఇది తరచుగా అనారోగ్యకరమైన ఆహార ఎంపికలకు దారితీస్తుంది.
రాత్రి భోజనం మానేయడం వల్ల క్యాలరీల వినియోగం తగ్గడమే కాకుండా జీర్ణక్రియ కూడా మెరుగుపడుతుంది. ఎందుకంటే రాత్రిపూట ఆలస్యంగా తినడం వల్ల బరువు పెరగడం, అసిడిటీ, నిద్ర సరిగా పట్టకపోవడం వంటి సమస్యలు వస్తాయి. కాబట్టి రాత్రి భోజనం మానెయ్యకూడదని డాక్టర్ దివ్య మాలిక్ సూచిస్తున్నారు. గర్భిణులు, పిల్లలు, మధుమేహం ఉన్నవారు వంటి వారికి రోజంతా స్థిరమైన పోషకాహారం అవసరం. రాత్రి భోజనం మానేస్తే శక్తి స్థాయిలు తగ్గిపోవచ్చు, పోషకాల కొరత ఏర్పడవచ్చు. ఒకవేళ రాత్రి భోజనం మానేస్తే, శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుకోవడం, మరుసటి రోజు ఎక్కువగా తినకుండా జాగ్రత్తపడటం చాలా అవసరం అని ఆమె తెలిపారు.






