ఇలాంటి స్త్రీలలో రొమ్ము క్యాన్సర్

by Sujitha Rachapalli |

గర్భనిరోధక మాత్రలు క్యాన్సర్ రిస్క్ పెంచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని హెచ్చరిస్తుంది అధ్యయనం. ఈస్ట్రోజెన్, ప్రొజెస్టెరాన్ స్థాయిలను మార్చి గర్భాన్ని నిరోధించే మాత్రలను గ్రూప్ 1 కార్సినోజన్‌లుగా వర్గీకరించింది. లక్షా పదివేల మంది మహిళల మెటా అనాలసిస్ ప్రకారం.. కాంట్రాసెప్టివ్

ఇలాంటి స్త్రీలలో రొమ్ము క్యాన్సర్
X

దిశ, వెబ్ డెస్క్ : గర్భనిరోధక మాత్రలు క్యాన్సర్ రిస్క్ పెంచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని హెచ్చరిస్తుంది అధ్యయనం. ఈస్ట్రోజెన్, ప్రొజెస్టెరాన్ స్థాయిలను మార్చి గర్భాన్ని నిరోధించే మాత్రలను గ్రూప్ 1 కార్సినోజన్‌లుగా వర్గీకరించింది. లక్షా పదివేల మంది మహిళల మెటా అనాలసిస్ ప్రకారం.. కాంట్రాసెప్టివ్ పిల్స్ వాడే వారిలో రొమ్ము క్యాన్సర్ రిస్క్ 38 శాతం ఎక్కువగా ఉంది. ఐదేళ్లు లేదా అంతకంటే ఎక్కువగా వాడితే గర్భాశయ క్యాన్సర్ ప్రమాదం 60శాతం పెరుగుతుందని.. పదేళ్లకు రెట్టింపు అవుతుందని తెలిపింది. ఈస్ట్రోజెన్ స్థాయిలు పెరగడం వల్ల క్యాన్సర్‌కు కారణమయ్యే జన్యువులు సక్రమంగా పని చేస్తాయి. ఈస్ట్రోజెన్ రిసెప్టర్లు చురుగ్గా మారుతాయి. ఇది రొమ్ము, గర్భాశయ కణాలలో అసాధారణ వృద్ధిని ప్రేరేపించవచ్చు.

* అయితే కొన్ని అధ్యయనాలు మాత్రం హార్మోనల్ గర్భనిరోధకాలు కొన్ని క్యాన్సర్‌ల రిస్క్‌ను తగ్గించొచ్చు. కానీ రొమ్ము, గర్భాశయ క్యాన్సర్ రిస్క్‌లతో సమతుల్యం చేయాలి. రక్తం గడ్డకట్టడం, గుండె సంబంధిత సమస్యల వంటి ఇతర రిస్క్‌లు కూడా ఉండవచ్చు. ముఖ్యంగా ధూమపానం చేసే మహిళలు, 35 ఏళ్లు దాటిన స్త్రీలలో ఈ ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.

* వాడకం ఆపిన తర్వాత కొంతమందిలో తాత్కాలికంగా సంతానోత్పత్తి ఆలస్యం అవుతుంది. జీవనశైలి, పోషకాహారం, రోజువారీ అలవాట్లు సంతానోత్పత్తిపై ప్రభావం చూపిస్తాయి.

Next Story