చల్లని నీరు - వేడి నీరు.. స్నానానికి ఏది మంచిది?

by Sujitha Rachapalli |

చల్లని నీరు - వేడి నీరు.. ఈ రెండింటిలో స్నానానికి ఏది మేలు అనే ప్రశ్న దాదాపు అందరిలో తలెత్తుతుంది. అయితే దీన్ని తమ తమ ఆరోగ్య వ్యవస్థ, రోజువారీ అవసరాలు,

చల్లని నీరు - వేడి నీరు.. స్నానానికి ఏది మంచిది?
X

దిశ, వెబ్ డెస్క్ : చల్లని నీరు - వేడి నీరు.. ఈ రెండింటిలో స్నానానికి ఏది మేలు అనే ప్రశ్న దాదాపు అందరిలో తలెత్తుతుంది. అయితే దీన్ని తమ తమ ఆరోగ్య వ్యవస్థ, రోజువారీ అవసరాలు, వాతావరణంపై ఆధారపడి ఎంచుకోవాలని సూచిస్తున్నారు నిపుణులు. నిజానికి ఈ రెండింటిలో లాభాలు, నష్టాలు రెండూ ఉండగా.. చల్లని నీరు శరీరాన్ని ఉత్తేజపరిచి మజిల్స్ రికవరీకి మేలు చేస్తుండగా.. వేడి నీరు బాడీని రిలాక్స్ చేసి నిద్రను మెరుగుపరుస్తుంది.

చల్లని నీటి స్నానం ప్రయోజనాలు:

* ఉదయం చల్లని నీరు స్నానం చేస్తే ఆక్సిజన్ తీసుకోవడం, గుండె రేటు పెరగడం ద్వారా మనసు, శరీరం రెండూ సక్రమంగా ఉంటాయి. చల్లటి నీరు రక్త ప్రసరణను మెరుగుపరచి.. రక్తపోటు సమస్యలు ఉన్నవారికి మేలు జరుగుతుంది.

* మజిల్స్ రికవరీ : వ్యాయామం తర్వాత చల్లటి స్నానం మజిల్స్ నొప్పి, ఇన్‌ఫ్లమేషన్‌ను తగ్గిస్తుంది. 2023 పరిశోధన ప్రకారం, ఇది మజిల్స్ ఫాటిగ్‌ను తగ్గిస్తుంది.

* జుట్టు ఆరోగ్యం :తలపై సహజ ఆయిల్ లేయర్‌ను కాపాడి.. జుట్టును ఆరోగ్యంగా ఉంచుతుంది.

* బరువు తగ్గుదల: కొన్ని అధ్యయనాల ప్రకారం.. చల్లటి నీటితో స్నానం ఫ్యాట్‌ బర్న్‌ను పెంచుతుంది. బరువును తగ్గిస్తుంది. బ్లీడింగ్ డిసార్డర్స్‌ను నియంత్రించి.. జీర్ణక్రియను ఉత్తేజపరుస్తుంది.

వేడి నీటి స్నానం ప్రయోజనాలు:

* పెయిన్ రిలీఫ్: మజిల్స్ టెన్షన్‌ను తగ్గించి.. ఒత్తిడిని తగ్గిస్తుంది. పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్‌ను ఉత్తేజపరచి.. మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

* శ్వాసకోశ సమస్యలకు మేలు: స్టీమ్ ద్వారా ముక్కు, గొంతును క్లియర్ చేస్తుంది.

* గుండె ఆరోగ్యం , నిద్ర: రక్తనాళాలను విస్తరించి.. రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. రక్తపోటును తగ్గిస్తుంది. రాత్రి వేడి నీటి స్నానం చేస్తే హాయిగా నిద్ర పడుతుంది.

Next Story