Mental Health : బర్న్ అవుట్ ఒత్తిడి సమస్య మాత్రమే కాదు.. మెదడు ఆరోగ్యంపైనా ప్రభావం చూపుతుందంటున్న నిపుణులు

by Javid Pasha |

బర్న్ అవుట్‌కు గురైనప్పుడు మెదడులోని ప్రీఫ్రంటల్ కార్టెక్స్‌లో ‘గ్రే మాటర్ తగ్గుతుంది. దీనివల్ల నరాల మధ్య కనెక్షన్స్ బలహీన పడతాయి.

Mental Health : బర్న్ అవుట్ ఒత్తిడి సమస్య మాత్రమే కాదు.. మెదడు ఆరోగ్యంపైనా ప్రభావం చూపుతుందంటున్న నిపుణులు
X

దిశ, ఫీచర్స్ : అధిక ఒత్తిడికి గురైనప్పుడు, విశ్రవాంతి లేనప్పుడు, ఆయా పరిస్థితులను మేనేజ్ చేయలేనప్పుడు వ్యక్తులు బర్న్ అవుట్ అవుతుంటారు. నిజానికి ఇది శారీరక, మానసిక, భావోద్వేగ అలసటకు సంబంధించిన ఒక ప్రతికూల స్థితి. ఇది మీ పనితీరు, ఉత్సాహం, ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. చాలామంది దీనిని లైట్‌గా తీసుకుంటుంటారు. కానీ తరచుగా బర్న్ అవుట్ అవడమనేది కేవలం స్ట్రెస్ రిలేటెడ్ ఇష్యూ మాత్రమే కాదని, అది మీ మెదడు ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపే నరాల సంబంధిత స్థితి కూడా అని ‘Neuropsychopharmacology’లో పబ్లిషైన ఒక అధ్యయనం పేర్కొన్నది. పలు ఇతర అధ్యయనాలు సైతం ఇదే వెల్లడించాయి. జాగ్రత్త పడి నివారించకపోతే పలు ఇతర సమస్యలకు దారితీస్తుందిని చెబుతున్నాయి.

నిజానికి నిరంతర ఒత్తిడి వల్ల బర్న్ అవుట్‌కు గురైనప్పుడు మెదడులోని ప్రీఫ్రంటల్ కార్టెక్స్‌లో ‘గ్రే మాటర్ (gray matter)’ అనే పదార్థం తగ్గుతుందని పరిశోధకులు, వైద్య నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల నరాల మధ్య కనెక్షన్స్ బలహీన పడతాయి. ఫలితంగా నిర్ణయాత్మక శక్తి (Decision-making power), వివిధ అంశాలపై కేంద్రీకరణ(focus), భావోద్వేగ నియంత్రణ దెబ్బతింటాయి. అంతేకాకుండా ఆ సమయంలో మెదడులోని అమిగ్డాలా అతి చురుకుగా(hyperactive) మారి, ఆందోళన, భయం వంటి ప్రతిస్పందనలను తీవ్రతరం చేస్తుంది.

తరచుగా బర్న్ అవుట్‌కు గురయ్యే పరిస్థితివల్ల చిన్న ఒత్తిడి లేదా చిన్న సమస్య ఎదురైనా అతిగా అనిపించేలా, అతిగా ఆలోచించేలా చేస్తుంది. వాస్తవానికి ఒత్తిడి కూడా మనిషికి అవసం. ఇది అలర్ట్‌నెస్‌ను పెంచుతుంది. పనితీరును మెరుగు పరుస్తుంది. కానీ‌ బర్న్ అవుట్‌కు దారితీయగలిగేంత నిరంరతర ఒత్తిడి మాత్రం ప్రమాదకరం అంటున్నారు మానసిక ఆరోగ్య నిపుణులు. ఎందుకంటే.. ఇది మెదడును సర్వైవల్ మోడ్‌లోకి నెట్టి క్రియేటివిటీని దెబ్బతీస్తుందని, పాజిటివ్ థాట్స్‌ను అడ్డుకుంటుందని చెబుతున్నారు. అందుకే నిరంతర ఒత్తిడికి దారితీసేపరిస్థితులను నివారించాలని, ఒకవేళ అలాంటి పరిస్థితుల్లో పనిచేయాల్సి వస్తే మేనేజ్ చేసే టెక్నిక్స్ పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. Link

Next Story