ఊహించడానికే భయంకరంగా ఉంది.. కంటిన్యూగా వెయ్యి రోజులు ఆ మహిళ ఎలా తట్టుకుందో?

by Sujitha Rachapalli |

పీరియడ్ సైకిల్‌తో అమ్మాయిలకు ప్రతీ నెల ఓ పరీక్షే. మూడు నుంచి ఏడు రోజులపాటు వచ్చే రుతుస్రావంతో సాధారణ జీవితం కచ్చితంగా ప్రభావితమవుతుంది. ఇంకొందరికి అయితే

ఊహించడానికే భయంకరంగా ఉంది.. కంటిన్యూగా వెయ్యి రోజులు ఆ మహిళ ఎలా తట్టుకుందో?
X

దిశ, ఫీచర్స్ : పీరియడ్ సైకిల్‌తో అమ్మాయిలకు ప్రతీ నెల ఓ పరీక్షే. మూడు నుంచి ఏడు రోజులపాటు వచ్చే రుతుస్రావంతో సాధారణ జీవితం కచ్చితంగా ప్రభావితమవుతుంది. ఇంకొందరికి అయితే ఈ సమయంలో వచ్చే కడుపు నొప్పి, హెవీ బ్లీడింగ్ మరింత అధ్వాన్న పరిస్థితిని కలిగిస్తుంది. ఓ వారం రోజుల పాటే ఇంత ప్రాబ్లమేటిక్‌గా ఉంటే దాదాపు వెయ్యి రోజులకుపైగా కంటిన్యూగా ప్రతిరోజు అధిక రక్తస్రావం అయితే ఆ అమ్మాయి సిట్యుయేషన్ ఎలా ఉంటుందో ఊహించేందుకు కూడా భయంగా ఉంటుంది. కానీ యూకేలోని వోర్సెస్టర్‌షైర్‌కు చెందిన 29ఏళ్ల మహిళ బెథనీ లాంబర్ట్ ఈ పరిస్థితిని ఎదుర్కొంది. నిరంతర రక్తస్రావంతో బాధపడింది.

2020లో బెథనీకి ఈ పరిస్థితి స్టార్ట్ అయింది. మొదట్లో ఒత్తిడి, హార్మోన్ల అసమతుల్యత వల్ల ఇలా జరుగుతుందనుకుంది. ఆ తర్వాత అలాగే కంటిన్యూ కావడంతో డాక్టర్‌ను సంప్రదించింది. అనేక వైద్య పరీక్షలు, అల్ట్రాసౌండ్‌లు, రక్త పరీక్షలు, హిస్టెరోస్కోపీ వంటివి చేయించుకుంది. ఏ పరీక్షలోనూ కారణం స్పష్టంగా తెలియలేదు. దీనివల్ల ఆమె శారీరకంగా, మానసికంగా అలసిపోయింది. ఈ సమస్య ఆమె రోజువారీ జీవితం, పని, సంబంధాలపై తీవ్ర ప్రభావం చూపింది. 2024లో ఒక స్పెషలిస్ట్ ఈ కేసును రివ్యూ చేశాక.. ఆమెకు ‘‘బైకార్నుయేట్ యూటరస్’’ అనే అరుదైన పరిస్థితి ఉన్నట్లు నిర్ధారించాడు. ఈ పరిస్థితితో బాధపడేవారి గర్భాశయం గుండె ఆకారంలో ఉండి.. రెండు భాగాలుగా విభజించబడి ఉంటుంది. ఇది ఎక్కువ కాలం రక్తస్రావం, బాధాకరమైన రుతుస్రావం, సంతానోత్పత్తి సమస్యలకు కారణమవుతుంది. హార్మోనల్ ట్రీట్మెంట్స్‌, గర్భాశయ ఆకారాన్ని సరిచేసేందుకు మెట్రోప్లాస్టీ వంటి సర్జరీ అవసరమని తెలిపారు నిపుణులు. కాగా ఈ అరుదైన స్త్రీ జననేంద్రియ సమస్యల గురించి అవగాహన పెంచేందుకు ఈ విషయాన్ని ఓపెన్‌గా షేర్ చేసింది బెథనీ.




Next Story