- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అప్పుడే పుట్టిన బిడ్డకు ప్రెగ్నెన్సీ.. నిర్ధారించిన వైద్యులు.. సైన్స్‌కే సవాల్ విసిరిన ఘటన
హాంగ్ కాంగ్‌లో అరుదైన ఘటన చోటు చేసుకుంది. అప్పుడే పుట్టిన బిడ్డ కడుపులో మరో బిడ్డ ఉన్నట్లు నిర్ధారించారు వైద్యులు. ఫీటస్-ఇన్-ఫీటస్ అనే ఈ అరుదైన వైద్య స్థితిలో.. ఒక శిశువు తన ట్విన్ సిస్టర్ లేదా ట్విన్ బ్రదర్‌ను తన కడుపులో మోస్తుంది.

దిశ, వెబ్‌సైట్ : హాంగ్ కాంగ్‌లో అరుదైన ఘటన చోటు చేసుకుంది. అప్పుడే పుట్టిన బిడ్డ కడుపులో మరో బిడ్డ ఉన్నట్లు నిర్ధారించారు వైద్యులు. ఫీటస్-ఇన్-ఫీటస్ అనే ఈ అరుదైన వైద్య స్థితిలో.. ఒక శిశువు తన ట్విన్ సిస్టర్ లేదా ట్విన్ బ్రదర్‌ను తన కడుపులో మోస్తుంది. 2010 నవంబర్‌లో హాంగ్ కాంగ్‌లోని క్వీన్ ఎలిజబెత్ హాస్పిటల్‌లో జన్మించిన నవజాత బాలిక కడుపులో రెండు పాక్షికంగా అభివృద్ధి చెందిన పిండాలు ఉన్నాయని గుర్తించారు.
డాక్టర్లు మొదట శిశువు కడుపులో ట్యూమర్ ఉందని అనుమానించారు. ఎందుకంటే అల్ట్రాసౌండ్‌లో ఆమె కడుపు పెద్దదిగా కనిపించింది. పుట్టిన తర్వాత మళ్లీ నంబర్ ఆఫ్ స్కాన్స్ చేశారు. వెన్నెముక, అవయవాలు, పేగులు, ప్రాథమిక మెదడు కణజాలంతో.. సుమారు 8–10 వారాల రెండు గర్భస్థ పిండాలను గుర్తించారు. కాగా శిశువు మూడు వారాల వయస్సులో వీటిని శస్త్రచికిత్స ద్వారా తొలగించారు. ఆ తర్వాత ఆమె కోలుకున్నట్లు తెలిపారు.
ఫీటస్-ఇన్-ఫీటస్ అంటే ఏమిటి?
ఇలాంటి అరుదైన ఘటన సుమారు 5,00,000 జననాలలో ఒకటి ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా 200 కంటే తక్కువ కేసులు నివేదించబడ్డాయి. ట్విన్ ప్రెగ్నెన్సీలో.. ఒక పిండం మరో పిండంలో ప్రారంభ దశలో చేరిపోతుంది. పరాన్నజీవి జంటగా మారుతుంది. ఇది హోస్ట్ యొక్క రక్త సరఫరాపై ఆధారపడుతుంది. అయితే ఇలా మరో పిండంలోకి చేరిన బేబీ ఎదుగదల ఆగిపోతుంది. కానీ అవయవాలు, వెన్నెముక వంటి లక్షణాలను నిలుపుకుంటుంది.






