చలికాలంలో వచ్చే జలుబు, దగ్గు.. ఈ టీతో చిటికెలో మాయం

427

దిశ, వెబ్‌డెస్క్ : చలికాలం వచ్చిందంటే చాలు చాలామందికి జలుబు, జ్వరం, దగ్గు కామన్‌గా వస్తుంటాయి. కొంత మంది జ్వరం జలుబుతో చాలా ఇబ్బంది పడుతుంటారు. అలాంటివారికి జలుబు, దగ్గు జ్వరం నుంచి త్వరగా ఉపశమనం పొందాలంటే ఆయుర్వేద టీ తాగడం ఎంతో మంచిది అంటున్నారు నిపుణులు. అల్లం ముక్కలు, వెల్లుల్లి ముక్కలు, పసుపు పంచదార, తేనె, నిమ్మరసం, బెల్లం వీటన్నితో తయారు చేసే ఆయుర్వేద టీ ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఈ టీని జ్వరం, జలుబు ఎక్కువగా ఉన్నవారు రోజుకు మూడు సార్లు తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. అంతే కాకుండా అనేక రోగాలకు ఆయుర్వేద టీ అద్భుతంగా పనిచేస్తోంది.

ఆయుర్వేద టీలో నిమ్మరసం వల్ల శరీరానికి సీ విటమిన్ లభిస్తుంది. బెల్లం శరీరంలో వేడిని నియంత్రిస్తుంది. అల్లం గొంతులో నొప్పిని దూరం చేస్తుంది. వెల్లుల్లి రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. ఇక పసుపు యాంటీబ్యాక్టీరియల్. ఇది వైరస్‌లు, బ్యాక్టీరియా అంతు చూస్తుంది. తేనె సర్వరోగ నివారిణి. టీ పొడి నుంచి వచ్చే కషాయం మెదడును చైతన్య పరుస్తుంది. ఇలా అన్నీ కలగలిపిన ఈ ఆయుర్వేద టీ మందుల కంటే అద్భుతంగా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు. అందువలన ఈ కాలంలో వచ్చే జలుబు, గొంతు నొప్పి, దగ్గుకు, ఆసుపత్రికి వెళ్లడం కన్న ఇంటిలో ఉన్నవాటితో ఆయుర్వేద టీ చేసుకోవడం ఉత్తమమం, దీని వలన జలుబు, దగ్గు చిటికెలో మాయం అవుతాయి. అంతే కాకుండా ఆయుర్వేద టీ కఫం సంబంధ వ్యాధులకు కూడా దివ్వఔషదంగా పనిచేస్తోంది.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..