మద్యంతో అనారోగ్య సమస్యలకు చెక్.. మహిళలు రోజుకు ఎంత సేవించవచ్చు..?

by  |
మద్యంతో అనారోగ్య సమస్యలకు చెక్.. మహిళలు రోజుకు ఎంత సేవించవచ్చు..?
X

దిశ, వెబ్‌డెస్క్ : మద్యం సేవించే వారు చాలా మందే ఉంటారు. కొంత మందికైతే మద్యం లేనిదే పూట గడవదు. అయితే మద్యపానం ఆరోగ్యానికి హానికరం అనే విషయం అందరికి తెలిసిందే. కానీ, మద్యం సేవిచడం వలన కూడా ఆరోగ్యానికి మేలు జరుగుతుందని నిపుణులు అంటున్నారు. అయితే ఈ మద్యం సేవించడం వలన ఆరోగ్యానికి ఏం ప్రయోజనం.. ఎంత మోతాదులో తీసుకోవడం వలన ఆరోగ్యానికి మంచి జరుగుతుంది. మహిళలు మద్యం సేవించడం మంచిదేనా.. వారు ఎంత మోతాదులో తీసుకోవాలి అనేది చూద్దాం.

మద్యం వలన ఆరోగ్యానికి మంచి జరగాలంటే తగినంత మోతాదులో తీసుకోవాలని నిపుణులు చెప్తున్నారు. అయితే రోజుకి మహిళలు ఒక డ్రింక్, పురుషులు రెండు డ్రింకులు తీసుకోవడం వల్ల అద్భుతమైన ప్రయోజనాలు పొందవచ్చు. రోజు ఇలా మద్యం తీసుకుంటే కొన్ని రకాల ఆరోగ్య సమస్యలకు చెక్ పెట్ట వచ్చునని నిపుణులు చెప్తున్నారు. ఒక డ్రింక్ అంటే 12 ఔన్సుల బీరు లేదా 5 ఔన్సుల వైన్ లేదా 1.5 ఔన్సుల లిక్కర్ అయినా తీసుకోవచ్చు. దీని వలన మానసిక ఆనందం పొందవచ్చు. అయితే గర్భిణీలు ఆల్కహాల్ తీసుకోకూడదు. అదే విధంగా లివర్ సమస్యలు ఉండే వాళ్ళు కూడా ఆల్కహాల్ కి దూరంగా ఉండటం మంచిది. ఆల్కహాల్ మహిళల్లో గర్భధారణ సామర్థ్యాన్ని తగ్గిస్తుందని నిపుణులు చెప్తున్నారు. అందువలన సాధ్యమైనంత వరకు మహిళలు మద్యం సేవించకపోవడమే ఉత్తమం.

మద్యం సేవించడం వలన కలిగే ప్రయోజనాలు..

  • తక్కువ మోతాదులో మద్యం తీసుకోవడం వల్ల గుండెజబ్బులు దూరమయ్యే అవకాశాలున్నాయి.
  • తగినంత మోతాదులో ఆల్కహాల్ తీసుకోవడం వల్ల కిడ్నీలో రాళ్లు వంటి సమస్యలు రాకుండా చూసుకుంటుంది. అయితే ఎక్కువగా ఆల్కహాల్ తీసుకోవడం వల్ల డీహైడ్రేషన్ అయిపోయి కిడ్నీ స్టోన్స్ రిస్క్ పెరుగుతుంది. కాబట్టి తగినంత మోతాదులో మాత్రమే తీసుకోవాలి.
  • తగినంత మోతాదులో ఆల్కహాల్ తీసుకోవడం వలన జీవితకాలం కూడా పెరుగుతుందని నిపుణులు చెప్తున్నారు.
  • బరువు తగ్గాలి అనుకునేవారు మద్యం సేవించడం ద్వారా బరువు తగ్గవచ్చు.
  • తగినంత మోతాదులో మద్యం సేవించడం ద్వారా మానసిక సమస్యలు లేకుండా ఆనందంగా ఉండవచ్చు.

Next Story

Most Viewed