గోరుచిక్కుడు వల్ల ఎన్ని లాభాలో..

by  |
గోరుచిక్కుడు వల్ల ఎన్ని లాభాలో..
X

దిశ, వెబ్‌డెస్క్: మనం ఆహారంలో తీసుకునే గోరు చిక్కుడుకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఇది శరీరానికి అవసరమైన పోషక విలువలను అందిస్తాయి. గోరుచిక్కుడుతో రకరకాలు వంటలు చేసుకుంటాము. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. ఇప్పుడు గోరుచిక్కుడు వల్ల ప్రయోజనాలెంటో తెలుసుకుందాం..

గోరుచిక్కుడులో క్యాలరీలు చాలా తక్కువగా ఉంటాయి. వీటిలో ప్రోటీన్స్, మినరల్స్, విటమిన్స్ వంటివి ఉండడంతో శరీరానికి అవసరమైన పోషక విలువలను అందిస్తుంది. ఇక గోరుచిక్కుడులో ఉండే ఖనిజాలు గుండె సంబంధిత వ్యాధులను దూరం చేస్తుంది. మధుమేహ వ్యాధి నుంచి ఉపశమనం పొందేందుకు గోరుచిక్కుడు ఎంతో సహయపడుతుంది. దీనిలో ఉండే ఫైబర్ రక్తంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి రక్తహీనత సమస్యలను దూరం చేస్తుంది. గోరుచిక్కుడులో ఉండే విటమిన్ సి వ్యాధి నిరోధక శక్తి పెంపొందించడంలో తోడ్పడుతుంది.

గోరుచిక్కుడులో ఐరన్, యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉంటాయి. దీంతో చర్మంలో దెబ్బతిన్న కణాలను తొలగించడానికి ఉపయోగపడతాయి. గర్బిణీ స్త్రీలు గోరిచిక్కుడును ఆహారంలో తీసుకుంటే శిశువు ఆరోగ్యానికి మేలు చేస్తుంది. దీనిలో ఉండే కాల్షియం ఎముకల కండరాలకు బలం చేకూర్చుతుంది. ఇక గోరుచిక్కుడు హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచుతుందని వైద్యులు సూచిస్తున్నారు.


Next Story

Most Viewed