కామంతో రెచ్చిపోయిన కానిస్టేబుల్.. స్టేషన్‌కు వెళ్లిన మైనర్‌పై..

by  |
Rape-1
X

దిశ, వెబ్‌డెస్క్ : రోజురోజుకు మహిళలపై దాడులు పెరిగిపోతున్నాయి. చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు ఎవరిని వదలడం లేదు. న్యాయం చేయాల్సిన వారు కూడా తమ బాధ్యతలు మరిచి క్రూరంగా ప్రవర్తిస్తున్నారు.

తాజాగా నెల్లూరు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. కౌన్సిలింగ్ ఇప్పిస్తానని చెప్పి ఓ బాలికపై హెడ్ కానిస్టేబుల్ అత్యాచారయత్నం చేసిన ఘన స్థానికంగా కలకలం సృష్టిస్తోంది. వివరాల్లోకి వెళ్లితే.. ఓ తండ్రి అతని కూతురును తీసుకోని జిల్లాలోని చిట్టమూరు పోలీస్ స్టేషన్‌‌కి వెళ్లారు. అయితే బాలిక సమస్య తీరాలంటే కౌన్సిలింగ్ ఇవ్వాలని చెప్పి.. చిన్నారిని తీసుకుని ఇంటికి రండి అని బాలిక తండ్రికి కానిస్టేబుల్ చెప్తాడు. దీంతో మరసటి రోజు బాలికను తీసుకొని ఆమె తండ్రి పోలీసుల దగ్గరకు వెళ్లగా చిన్నారి తండ్రిని దుకాణానికి పంపించి బాలికపై అత్యాచారయత్నానికి ఒడిగట్టాడు కానిస్టేబుల్. ఇంటికి వెళ్ళాక బాలిక తన కుటుంబ సభ్యులకు విషయం చెప్పడంతో ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో హెడ్ కానిస్టేబుల్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.



Next Story

Most Viewed