‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’ టెన్ ఇయర్స్ సెలబ్రేషన్స్.. అభిమానులకు అదిరే గిఫ్ట్స్!

by  |
‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’ టెన్ ఇయర్స్ సెలబ్రేషన్స్.. అభిమానులకు అదిరే గిఫ్ట్స్!
X

దిశ, సినిమా : ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’ టెన్ ఇయర్స్ యానివర్సరీని HBO Max స్ట్రీమింగ్ సర్వీస్ గ్రాండ్‌గా సెలబ్రేట్ చేస్తోంది. ‘ఐరన్ యానివర్సరీ’ పేరుతో సెలబ్రేషన్స్ స్టార్ట్ చేసిన HBO.. నెల రోజుల పాటు సెలబ్రేషన్స్ ప్లాన్ చేసింది. HBO Max యూజర్లకు సోమవారం నుంచే ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’ స్పాట్ లైట్ పేజీ అందుబాటులోకి రాగా.. అభిమానుల కోసం ఈస్టర్ ఎగ్స్ కలిగి ఉన్న స్పాయిలర్ – లాడెన్ క్యూరేషన్‌లను కూడా తీసుకొస్తోంది. ఈ స్పాట్ లైట్ పేజీలో 150 బిహైండ్ ది సీన్స్ క్లిప్స్, స్టార్స్ ఇంటర్వ్యూలు, ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’ టీజర్స్, ట్రైలర్లకు సంబంధించిన వీడియోలు అందుబాటులో ఉన్నాయి.

ఏప్రిల్ 10 నుంచి HBO గేమ్ ఆఫ్ థ్రోన్స్ ‘మారథ్రోన్స్‌’ను ప్రారంభించనుంది. HBO2లో ఉ.10 గంటల నుంచి ప్రసారం ప్రారంభం కానుండగా.. తద్వారా ఉమెన్ ఇంటర్నేషనల్, వరల్డ్ సెంట్రల్ కిచెన్, యూనిసెఫ్, ది ట్రెవర్ ప్రాజెక్ట్‌తో సహా గ్లోబల్ ఛారిటీల కోసం ఫండ్ రైజ్ చేయనుంది. న్యూ వేలో సిరీస్‌ చూసేందుకు కొత్తగా వచ్చే అభిమానులకు ఆరు వేర్వేరు మార్గాల్లో దిశానిర్దేశం చేయనుంది ‘మారథ్రోన్’. ఈస్టర్ ఎగ్స్ ద్వారా ప్రేక్షకులకు గిఫ్ట్స్ ఇవ్వబోతున్న HBO.. ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’ థీమ్‌తో పెళ్లిళ్లు చేసుకునేవారికి బహుమతులు అందించబోతున్నారు.

Next Story

Most Viewed