ఆ ఆపరేషన్ చేసుకోవడం ఇష్టం లేదు : రాధికా ఆప్టే

by Shyam |

<p>దిశ, సినిమా : బిగ్ స్క్రీన్‌తో పాటు స్మాల్ స్క్రీన్ పైనా ఆడియన్స్ అటెన్షన్ క్యాచ్ చేయడంలో నటి రాధికా ఆప్టే సక్సెస్ అయింది. నేటితో 36వ వసంతంలోకి అడుగుపెట్టిన రాధిక.. ఈ దశాబ్ద కాలంలో పలు మెమొరబుల్ పర్ఫార్మెన్సెస్‌తో గుర్తింపు తెచ్చుకుంది. ఈ క్రమంలో ‘అంధాదున్, ప్యాడ్‌మ్యాన్’ సినిమాలతో పాటు ‘సాక్రెడ్ గేమ్స్, గోల్, లస్ట్ స్టోరీస్’ వంటి వెబ్ సిరీస్‌‌లతో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఒక దశలో ‘ఓటీటీ క్వీన్’గా ప్రశంసలు అందుకుంది. [&hellip;]</p>

radika
X

దిశ, సినిమా : బిగ్ స్క్రీన్‌తో పాటు స్మాల్ స్క్రీన్ పైనా ఆడియన్స్ అటెన్షన్ క్యాచ్ చేయడంలో నటి రాధికా ఆప్టే సక్సెస్ అయింది. నేటితో 36వ వసంతంలోకి అడుగుపెట్టిన రాధిక.. ఈ దశాబ్ద కాలంలో పలు మెమొరబుల్ పర్ఫార్మెన్సెస్‌తో గుర్తింపు తెచ్చుకుంది. ఈ క్రమంలో ‘అంధాదున్, ప్యాడ్‌మ్యాన్’ సినిమాలతో పాటు ‘సాక్రెడ్ గేమ్స్, గోల్, లస్ట్ స్టోరీస్’ వంటి వెబ్ సిరీస్‌‌లతో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఒక దశలో ‘ఓటీటీ క్వీన్’గా ప్రశంసలు అందుకుంది. కాగా ఫిల్మ్ ఇండస్ట్రీలో నిలదొక్కుకునే క్రమంలో చాలా ఏళ్ల పాటు అనేక తిరస్కరణలకు గురైన రాధిక.. అందాన్ని పెంచుకునేందుకు ముక్కు ఆకృతిని ఆపరేషన్ ద్వారా సరిచేసుకోవాలనే సలహాలను ఏవిధంగా పక్కనబెట్టేసిందో ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది.

‘బ్యూటీ సర్జరీ గురించి సూచనలు ఎదురైనపుడు.. అలా ఎందుకు చేయాలి? అని నాకు నేనే ప్రశ్నించుకున్నా. ముక్కు ఆకృతిని మార్చుకోమని చెప్పినవారందరి దృష్టిలో.. అందమంటే పర్టిక్యులర్ బ్యూటీ స్టాండర్డ్స్ మాత్రమే. నేను కూడా అవే కొలతల ప్రకారం కనిపించాలని వారు కోరుకున్నారు. కానీ నాకు అది నచ్చలేదు’ అని చెప్పింది. ఇక కొత్త ప్రాజెక్ట్స్ విషయానికొస్తే.. నెట్‌ఫ్లిక్స్ ఇండియా నిర్మాణంలో వాసన్ బాల రూపొందిస్తున్న ‘మోనిక ఓ మై డార్లింగ్’, విక్రాంత్ మాసే డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ‘ఫోరెన్సిక్’తో పాటు ‘మేడ్ ఇన్ హెవెన్’లో నటిస్తోంది.

Next Story