సోషల్ మీడియా నుంచి బ్రేక్ తీసుకున్న బాలీవుడ్ నటి.. ప్రెగ్నెన్సీపై రూమర్స్

by  |
Hazel Keech Take A Break From Social Media
X

దిశ, సినిమా: బాలీవుడ్ నటి, యువరాజ్ సింగ్ వైఫ్ హాజెల్ కీచ్ సోషల్ మీడియాకు దూరంగా ఉంటున్నట్లు ప్రకటించింది. లైమ్ లైట్ నుంచి దూరంగా ఉండాలని డిసైడ్ అయిన యాక్ట్రెస్.. అభిమానులకు ఓ నోట్ రిలీజ్ చేసి బ్రేక్ తీసుకుంటున్నట్లు తెలిపింది. ‘నా ఫోన్ మరియు నేను విరామం తీసుకుంటున్నాము. ఇది మీలో చాలా మందికి షాకింగ్‌గా ఉండొచ్చు. బట్ దట్స్ ఓకే. ఒకరిపై ఒకరు పూర్తిగా ఆధారపడటం కంటే వ్యక్తిగా ఎలా జీవించాలో గుర్తుంచుకోవడానికి కొన్నిసార్లు మనకు ఈ సమయం అవసరం. అందుకే నేను కొంతకాలం సోషల్ మీడియా నుంచి బ్రేక్ తీసుకుంటున్నాను. రియల్ వరల్డ్‌లో జీవించేందుకు విష్ చేయండి. మీ దగ్గర నా నెంబర్ ఉంటే, మెసేజ్ కాకుండా కాల్ చేయండి. ఐ విల్ బి బ్యాక్.. నాట్ సూన్’ అంటూ ఇన్ స్టాగ్రామ్ వేదికగా పోస్ట్ పెట్టింది. ఈ పోస్ట్‌పై కామెంట్ చేస్తున్నారు నెటిజన్లు. తను ప్రెగ్నెంట్ కాబట్టే ఈ బ్రేక్ తీసుకుంటుందని అభిప్రాయపడుతున్నారు.


Next Story

Most Viewed