- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హసన్ అలీ ది గేమ్‌చేంజర్.. సోషల్ మీడియాలో నెటిజన్ల ట్రోల్స్
<p>దిశ, వెబ్‌డెస్క్: దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా ఉత్కంఠగా సాగిన టీ 20 వరల్డ్ కప్ సెమీస్ 2 మ్యాచ్‌లో పాకిస్తాన్‌పై ఆసీస్ అనూహ్య విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇక ఇదే మ్యాచ్ గురించి నెట్టింట్లో తీవ్ర చర్చ జరుగుతోంది. ఆల్‌రౌండర్ హసన్ అలీ తీరుపై పాకిస్తాన్ అభిమానులు ఫైర్ అవుతున్నారు. డెత్‌ఓవర్లలో మ్యాథ్యూ వేడ్ మ్యాచ్ స్వరూపన్నే మార్చేశాడు. ఆది నుంచి బ్యాటర్లను కట్టడి చేసిన షాహీన్ అఫ్రిది 19వ ఓవర్ వేశాడు. […]</p>

దిశ, వెబ్‌డెస్క్: దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా ఉత్కంఠగా సాగిన టీ 20 వరల్డ్ కప్ సెమీస్ 2 మ్యాచ్‌లో పాకిస్తాన్‌పై ఆసీస్ అనూహ్య విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇక ఇదే మ్యాచ్ గురించి నెట్టింట్లో తీవ్ర చర్చ జరుగుతోంది. ఆల్‌రౌండర్ హసన్ అలీ తీరుపై పాకిస్తాన్ అభిమానులు ఫైర్ అవుతున్నారు. డెత్‌ఓవర్లలో మ్యాథ్యూ వేడ్ మ్యాచ్ స్వరూపన్నే మార్చేశాడు. ఆది నుంచి బ్యాటర్లను కట్టడి చేసిన షాహీన్ అఫ్రిది 19వ ఓవర్ వేశాడు. ఈ క్రమంలో 12 బంతుల్లో 22 పరుగులు రావాల్సి ఉండగా తొలి రెండు బంతుల్లో రెండు పరుగులు వచ్చాయి. కానీ, మూడో బంతికి షాట్ ఆడబోయిన మ్యాథ్యూ వేడ్ హసన్ అలీ చేతికి క్యాచ్ ఇచ్చాడు. ఈ క్యాచ్ డ్రాప్ అవడంతో 2 పరుగులు రావడమే కాకుండా గేమ్ మొత్తం చేంజ్ అయింది. వరుసగా 3 సిక్సర్లు బాదిన వేడ్ 6 బంతులు మిగిలి ఉండగానే ఆసీస్‌ను విజయతీరాలను తేర్చాడు. ఇక ఆ క్యాచ్ చేజారడంతో పాకిస్తాన్ అభిమానులు హసన్ అలీపై మండిపడుతున్నారు. నువ్వు వదిలేసింది క్యాచ్ కాదు.. టీ20 వరల్డ్ కప్‌ను అంటూ ఫైర్ అవుతున్నారు. ఆసీస్ గెలిచేందుకు గేమ్ చేంజర్ హసన్ అలీ అంటూ పలువురు సెటైర్లు వేయడం గమనార్హం.






