రూ.6,550 కోట్ల ఖర్చుతో హరితహారం చేపట్టారా..? నిలదీసిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

by  |
రూ.6,550 కోట్ల ఖర్చుతో హరితహారం చేపట్టారా..? నిలదీసిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి
X

దిశ, డైనమిక్ బ్యూరో : రాష్ట్రంలో పచ్చదనాన్ని పెంపొందించేందుకు ‘హరిత హారం’ పేరిట నాటిన మొక్కల్లో 85 శాతం మొక్కలు బతికినట్లు ప్రభుత్వం చెబుతోందని, దానికి ఆధారాలు ఏమైనా ఉన్నాయా అని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రశ్నించారు. సోమవారం మండ‌లిలో హ‌రిత‌హారంపై జ‌రిగిన చర్చలో జీవన్ రెడ్డి మాట్లాడారు. హరితహారం అందరూ హర్షించదగ్గ కార్యక్రమమని, ఇందులో మొక్కలు నాటేందుకే పరిమితం కాకుండా సమాజానికి ఏవిధంగా మేలు చేస్తుందో చూడాలని సూచించారు. హరితహారంలో ఫల వృక్షాలు నాటేలా చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఫలితంగా సంబంధిత వర్గాలకు ఉపాధి దొరుకుతుందని తెలిపారు. అంతేకాకుండా రోడ్లకు ఇరువైపులా వెదురు చెట్లు నాటితే ఎలాంటి ఆక్రమణలు జరగవని తెలపారు. మొక్కలకు జియో ట్యాగింగ్ చేశామని ప్రభుత్వం చెబుతుందని, అలాంటివి ఎక్కడా కనిపించడం లేదన్నారు.

హరితహారంలో భాగంగా మొత్తం రూ.6,550 కోట్లు ఖర్చుచేసినట్లు రాష్ట్ర ప్రభుత్వం చెబుతోందని, అందులో కేంద్ర, రాష్ట్ర వాటాలు ఎంత, ఎన్ఆర్‌జీఎస్​నిధులు ఎంతనో తెలపాలని జీవన్​రెడ్డి కోరారు. ఈ సందర్భంగా.. 2016 -17లో 31.67 కోట్ల మొక్కలు నాటేందుకు రూ.738 కోట్లు, 2017-18లో 60 కోట్ల మొక్కలు నాటడానికి రూ.739 కోట్లు, 2020-21లో 33.43 కోట్ల మొక్కలు నాటేందుకు రూ.1,389 కోట్లు లెక్కన ఖర్చుచేసినట్లు ప్రభుత్వం చూపించిందని, వీటి మధ్య ఇంత వ్యత్యాసం ఎందుకు ఉందని ఆయన నిల‌దీశారు.



Next Story