- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హర్లీన్ సూపర్ క్యాచ్-సోషల్‌మీడియాలో వైరల్
<p>దిశ, వెబ్‌డెస్క్ : ఇంగ్లండ్‌తో శుక్రవారం జరిగిన టీ 20 మ్యాచ్‌లో భారత్ ఓడిపోయి ఉండవచ్చు, కానీ, హర్లీన్ పట్టిన ఓ క్యాచ్ మాత్రం చిరస్మరణీయంగా నిలిచిపోతుంది. టీమ్ ఇండియాకు చెందిన చాలా మంది క్రీడాకారులు గతంలో గొప్ప గొప్ప క్యాచ్‌లు పట్టుకున్నారు, అందులో హర్లీన్ ఫీల్డింగ్, క్యాచ్ మాత్రం ప్రత్యేకంగా నిలుస్తోందనడంలో సందేహం లేదు. సోషల్ మీడియా ఈ దృశ్యానికి విపరీత ప్రాముఖ్యం ఇస్తోంది. హర్లీన్ డియోల్ సూపర్ క్యాచ్ ‘సెన్సేషనల్’ అని ప్రశంసలు కురిపిస్తోంది. […]</p>

దిశ, వెబ్‌డెస్క్ : ఇంగ్లండ్‌తో శుక్రవారం జరిగిన టీ 20 మ్యాచ్‌లో భారత్ ఓడిపోయి ఉండవచ్చు, కానీ, హర్లీన్ పట్టిన ఓ క్యాచ్ మాత్రం చిరస్మరణీయంగా నిలిచిపోతుంది. టీమ్ ఇండియాకు చెందిన చాలా మంది క్రీడాకారులు గతంలో గొప్ప గొప్ప క్యాచ్‌లు పట్టుకున్నారు, అందులో హర్లీన్ ఫీల్డింగ్, క్యాచ్ మాత్రం ప్రత్యేకంగా నిలుస్తోందనడంలో సందేహం లేదు. సోషల్ మీడియా ఈ దృశ్యానికి విపరీత ప్రాముఖ్యం ఇస్తోంది. హర్లీన్ డియోల్ సూపర్ క్యాచ్ ‘సెన్సేషనల్’ అని ప్రశంసలు కురిపిస్తోంది. ఇంగ్లాండ్ క్రీడాకారిణి అమీజోన్స్ 19వ ఓవర్‌లో భారత బౌలర్ శిఖాపాండే విసిరిన బంతిని బౌండరీ బయటకు లేపింది. గాలిలో ఉన్న బంతిని హార్లిన్ పట్టుకుని బౌండరీ లోపలకు విసిరి, అది నేలమీద పడకముందే లోపలికి వచ్చి పట్టుకుంది. కనురెప్పపాటులో జరిగిన ఈ సంఘటన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
This is easily one of the best fielding moments ever! Truly incredible #HarleenDeol !! @BCCIWomen https://t.co/r0fshUxGLr
— Jyotiraditya M. Scindia (@JM_Scindia) July 10, 2021






