- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్యాలెస్‌లో సిలిండర్ మీద కూర్చున్న మంత్రి.. ఏం చేశారో తెలుసా..?
<p>దిశ ప్రతినిధి, కరీంనగర్: రాష్ట్ర మంత్రి ఒకరు ప్యాలెస్‌లో చాయ్ తాగి అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తారు. అదేంటీ మంత్రి ప్యాలెస్‌లో టీ తాగితే తప్పేంటి అనుకుంటున్నారా…? మంత్రి అంతటి వ్యక్తి ప్యాలెస్‌కు వెళ్లడం కామనే కదా అనుకుంటున్నారా.? అక్కడే తప్పులో కాలేస్తున్నారాగండి. ఇంతకీ ఆ మంత్రి ఎవరు? ఆయన ఏ ప్యాలెస్‌లో చాయ్ తాగారో తెలుసా? రాష్ట్ర ఆర్థిక మంత్రి తన్నీరు హరీష్ రావు హుజూరాబాద్ ఎన్నికల ప్రచారంలో బిజీబిజీగా తిరుగుతున్న సంగతి తెలిసిందే. శనివారం ఎన్నికల […]</p>

దిశ ప్రతినిధి, కరీంనగర్: రాష్ట్ర మంత్రి ఒకరు ప్యాలెస్‌లో చాయ్ తాగి అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తారు. అదేంటీ మంత్రి ప్యాలెస్‌లో టీ తాగితే తప్పేంటి అనుకుంటున్నారా…? మంత్రి అంతటి వ్యక్తి ప్యాలెస్‌కు వెళ్లడం కామనే కదా అనుకుంటున్నారా.? అక్కడే తప్పులో కాలేస్తున్నారాగండి. ఇంతకీ ఆ మంత్రి ఎవరు? ఆయన ఏ ప్యాలెస్‌లో చాయ్ తాగారో తెలుసా?
రాష్ట్ర ఆర్థిక మంత్రి తన్నీరు హరీష్ రావు హుజూరాబాద్ ఎన్నికల ప్రచారంలో బిజీబిజీగా తిరుగుతున్న సంగతి తెలిసిందే. శనివారం ఎన్నికల ప్రచారంలో భాగంగా పర్యటిస్తున్న మంత్రి హరీష్ రావు సడన్‌గా హుజూరాబాద్ పట్టణంలో ఆగిపోయారు. మంత్రి హరీష్ రావు కాన్వాయ్ ఆగిపోవడంతో స్థానికులంతా ఆశ్చర్యంతో ఏం జరుగుతోందని గమనిస్తున్నారు. కారు దిగిన మంత్రి హరీష్ నేరుగా పట్టణంలో ఫేమస్ అయిన టీ ప్యాలెస్‌లోకి వెళ్లి టీ తాగారు. హోటల్ యజమానితో ముచ్చటించారు. సడన్‌గా మంత్రి హరీష్ రావు ఎంట్రీ ఇవ్వడంతో ఉబ్బితబ్బిబ్బైన యజమాని మంత్రి కూర్చునేందుకు కూర్చి అందుబాటులో లేకపోవడంతో గ్యాస్ సిలిండర్ పై న్యాప్ కిన్ వేసి కూర్చొమన్నారు. దీంతో మంత్రి దానిపై కూర్చుంటూ సిలిండర్ ధరలు బాగా పెరిగిపోయాయంటూ కామెంట్ చేశారు. ఆ తరువాత టీ ప్యాలెస్‌లో చాయ్ తాగి వెళ్లిపొయారు.






