అప్పుడు ఒప్పుకొని… ఇప్పుడు తప్పుడు ప్రచారాలెందుకు: హరీశ్ రావు

by  |
అప్పుడు ఒప్పుకొని… ఇప్పుడు తప్పుడు ప్రచారాలెందుకు: హరీశ్ రావు
X

దిశ ప్రతినిధి, రంగారెడ్డి: తెలంగాణ ప్రభుత్వం లక్షా 34 వేల ఉద్యోగాలను భర్తీ చేసిందని శాసన మండలిలో అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రిగా తాను ఉన్నప్పుడు వివరిస్తే ఒప్పుకున్న ఎమ్మెల్సీ రాంచందర్ రావు… ఇప్పుడు ఎన్నికల కోసం తప్పుడు ప్రచారం చేస్తున్నారని మంత్రి హరీశ్ రావు విమర్శించారు. ఆనాడు శాసనమండలిలోనే ఎందుకు ప్రభుత్వాన్ని ప్రశ్నించలేదని రాంచందర్ రావును ఆయన సూటిగా ప్రశ్నించారు.

రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్లలో ఆదివారం నిర్వహించిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశంలో మంత్రి హరీశ్ రావు హాజరై ప్రసంగించారు. గిరిజన యూనివర్సిటీ, బయ్యారం ఉక్కు ప్యాక్టరి, బీఆర్జీవో కింద రాష్ట్రానికి ఇవ్వాల్సిన రూ.9వేల కోట్లు, వరంగల్‌లో కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు ఏమైందని బీజేపీ ప్రభుత్వాన్ని నిలదీశారు. ఎన్నికల కోసం పశ్చిమ బెంగాల్, కేరళలో మెట్రో రైలు నిర్మాణానికి, గుజరాత్‌లో బుల్లెట్ రైలు ఏర్పాటుకు నిధులు కేటాయించిన కేంద్రం… తెలంగాణ రాష్ట్రానికి ఎన్ని నిధులు కేటాయించిందని ప్రశ్నించారు. క్రూడ్ ఆయిల్ ధరలు తక్కువగా ఉన్నప్పటికీ పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలు పెంచి ప్రజలపై భారం మొపుతున్నారని అన్నారు.


Next Story