హరీశ్ ‘మల్టిపుల్ అవతార్’

by  |
హరీశ్ ‘మల్టిపుల్ అవతార్’
X

దిశ, వెబ్‌డెస్క్: కోలీవుడ్ యంగ్ హీరో హరీశ్ కళ్యాణ్, డైరెక్టర్ ఎలన్, మ్యూజిక్ డైరెక్టర్ యువన్ శంకర్ రాజా కాంబినేషన్‌లో ‘ప్యార్ ప్రేమ కాదల్’ బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకుంది. 2018లో సక్సెస్ కొట్టిన ఈ పవర్ ప్యాక్డ్ కాంబినేషన్ మరోసారి రిపీట్ కాబోతుంది. ఈ విషయాన్ని ప్రకటించిన డైరెక్టర్ ఎలన్.. సేమ్ జోనర్‌లో కాకుండా డిఫరెంట్‌గా ట్రై చేస్తున్నామని తెలిపారు. ‘ప్యార్ ప్రేమ కాదల్‌’ కన్నా ఈ సినిమాలో ఎక్కువ సాంగ్స్ ఉంటాయని తెలిపిన ఆయన.. హరీష్ కళ్యాణ్ డిఫరెంట్ గెటప్స్‌లో కనిపించబోతున్నారని చెప్పారు. త్వరలో ఫస్ట్ లుక్ రిలీజ్ చేయబోతున్నట్లు వెల్లడించారు.

కరోనా వల్ల మ్యూజిక్ కంపోజిషన్స్‌కు అబ్రోడ్ వెళ్లే చాన్స్ లేకపోవడంతో.. చెన్నై, ముంబై, గోవాలో కంపోజిషన్స్ కంప్లీట్ చేసినట్లు చెప్పారు. గతంలో ‘ప్యార్ ప్రేమ కాదల్’ మ్యూజిక్ కంపోజిషన్ కోసం బ్యాంకాక్ వెళ్లారు. ఇక ప్రజెంట్ కమిట్ అయిన సినిమా కాస్ట్ అండ్ క్రూ డీటెయిల్స్ త్వరలో ప్రకటిస్తామని వెల్లడించిచారు డైరెక్టర్ ఎలన్. కాగా నాని ‘జెర్సీ’ సినిమా క్లైమాక్స్‌లో కొడుకుగా గెస్ట్ అప్పీయరెన్స్ ఇచ్చి, చాలా ఫ్రెష్ ఫీల్ ఇచ్చారు హరీష్ కళ్యాణ్.



Next Story

Most Viewed