నిర్మాత ఇంటి ఎదుట ఆందోళన

by  |
నిర్మాత ఇంటి ఎదుట ఆందోళన
X

కరోనా కారణంగా ఫిల్మ్ ఇండస్ట్రీ కష్టాల్లో మునిగిపోయింది. సినిమా, సీరియల్ షూటింగ్స్ లేక నటీనటులు ఆర్థిక కష్టాలను ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే ‘ప్రయాణం’ హీరోయిన్.. తను ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నానని ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ప్రముఖ హిందీ సీరియల్ ‘హమారి బహు సిల్క్’లో నటిస్తున్న వందన కూడా డబ్బుల్లేక ఇబ్బందులు ఎదుర్కొంటూ.. ఆన్‌లైన్‌లో రాఖీలు విక్రయిస్తోంది. ఇలా ఎందుకు చేస్తున్నారని? ప్రశ్నించగా ‘హమారి బహు సిల్క్’ సీరియల్ నిర్మాతలు.. లక్షల్లో జీతాలు ఇవ్వాల్సిఉన్నా స్పందించడం లేదని.. అందుకే ఈ పని చేస్తున్నట్లు తెలిపింది. ఈ విషయం వెలుగులోకి వచ్చిన కొద్ది గంటల్లోనే ఆ సీరియల్ నటీనటులందరూ ముంబైలోని యారి రోడ్‌లో ఉన్న నిర్మాత దేవయాని ఇంటి ఎదుట ఆందోళనకు దిగారు. యూనిట్‌లో ప్రతి ఒక్కరూ ఇదే సమస్యను ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. సీరియల్ నిర్మాత దీనిపై వెంటనే స్పందించాలని.. జీ యాజమాన్యం తమకు సపోర్ట్ చేయాలని కోరారు.



Next Story

Most Viewed