బెగ్గర్ ఫ్రీ హైదరాబాద్‌.. స్పెషల్ డ్రైవ్ స్టార్ట్..

by  |
hyd pc
X

దిశ,వెబ్ డెస్క్: భాగ్యనగరాన్ని బెగ్గర్ ఫ్రీ హైదరాబాద్‌గా చేసేందుకు ఎట్టకేలకు కార్యచరణ ప్రారంభం అయింది. అలనాడు అమెరికా అధ్యక్షడు ట్రంప్ కుమార్తె హైదరాబాద్‌లో పర్యటించినప్పటి కబురు ఇది. అప్పుడు చెప్పిన బెగ్గర్ ఫ్రీ హైదరాబాద్‌ ఇప్పటికీ రాలేదు.

అయితే తాజాగా హబీబ్‌నగర్‌లో బెగ్గర్ ఫ్రీ సిటీ ఆపరేషన్‌ను చేపట్టారు. ఈ క్రమంలో మంగళవారం సిటీలోని 60 మంది నిరాశ్రయులను ‘అమ్మ నాన్న అనాథ’ ఆశ్రమానికి తరలించి ఈ స్పెషల్ డ్రైవ్‌ను ప్రారంభించారు. ఈ విషయాన్ని ట్విటర్ వేదికగా పోలీసులు తెలిపారు. దీనిపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. హైదరాబాద్ ఫ్రెండ్లీ పోలీస్.. మీకు సెల్యూట్ అని, చాలా మంచి ప్రారంభం అని కొనియాడారు.



Next Story

Most Viewed