హైదరాబాద్‌లో భారీగా గుట్కా ప్యాకెట్లు పట్టివేత

by  |
హైదరాబాద్‌లో భారీగా గుట్కా ప్యాకెట్లు పట్టివేత
X

దిశ, తెలంగాణ క్రైమ్‌బ్యూరో: హైదరాబాద్‌ నగరంలో వేర్వేరు చోట్ల దాడులు నిర్వహించిన టాస్క్‌ఫోర్స్ పోలీసులు రూ.10లక్షల విలువైన గుట్కా ప్యాకెట్లను పట్టుకున్నారు. బండ్లగూడ సీ హోటల్ సమీపంలో ఆర్ఎఫ్ చాలియా స్టోర్ గోడౌన్‌లో నిషేధిత గుట్కా నిల్వ ఉన్నట్లు సమాచారం అందుకొని చాంద్రాయణగుట్ట పోలీసులతో కలిసి సోదాలు చేశారు. అక్రమంగా నిల్వ ఉంచిన రూ.8లక్షల విలువైన గుట్కాప్యాకెట్లను స్వాధీనం చేసుకొన్నారు. అటు భవానీ నగర్‌లో అక్రమంగా నిల్వ ఉంచిన రూ.2లక్షల విలువైన పొగాకు ఉత్పత్తులను పట్టుకున్నారు.



Next Story

Most Viewed