సత్యదేవ్ న్యూ మూవీ లాంచ్

by  |
సత్యదేవ్ న్యూ మూవీ లాంచ్
X

హీరో సత్యదేవ్కు జోడిగా తమన్నా నటిస్తున్న చిత్రం ‘గుర్తుందా శీతాకాలం’. నాగ శేఖర్ డైరెక్ట్ చేస్తూ నిర్మిస్తున్న చిత్రాన్ని శుక్రవారం లాంచ్ చేశారు. ఇందుకు సంబంధించిన పూజా కార్యక్రమాల్లో సత్యదేవ్, నాగ శేఖర్‌తో పాటు మ్యూజిక్ డైరెక్టర్ కాల భైరవ పాల్గొన్నారు. ఇంతకు ముందు రీమేక్ మూవీ ‘ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్యా’తో హిట్ కొట్టిన సత్యదేవ్..ఈసారి కూడా కన్నడ సినిమా ‘లవ్ మాక్ టైల్’ రీమేక్‌తో అలరించేందుకు సిద్ధం అయ్యాడు.

ఫస్ట్ టైమ్ ఫుల్ లెంత్ లవ్ స్టోరీ చేస్తున్న సత్య దేవ్.. తన అభిమాన నటి తమన్నాతో నటించడం సంతోషంగా ఉందన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ నాగ‌శేఖర్ ‘గుర్తుందా శీతాకాలం’ టైటిల్ అనౌన్స్‌మెంట్‌తోనే తెలుగు సినిమా మార్కెట్‌లో మంచి క్రేజ్ ఏర్పడిందని చెప్పారు. ఇప్పటికే భారీ అంచనాలు ఉన్న చిత్రం..ప్రేక్షకులు కోరుకున్న విధంగా ఉంటుందని తెలిపారు. తమన్నా, సత్య‌దేవ్ జంట తెరపై అలరిస్తుందని ప్రామిస్ చేశారు.


Next Story

Most Viewed