‘గుంజన్ సక్సేనా’ రిలీజ్ డేట్ ఫిక్స్

by  |
‘గుంజన్ సక్సేనా’ రిలీజ్ డేట్ ఫిక్స్
X

జాన్వీ కపూర్.. అతిలోక సుందరి శ్రీదేవి కూతురిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. తొలి సినిమా ధడక్‌తోనే ప్రేక్షకులను ఫిదా చేసిన జాన్వీ.. రెండో సినిమాకే సరికొత్త ప్రయోగం చేసింది. యుద్ధంలో పాల్గొన్న తొలి భారత మహిళా ఎయిర్‌ఫోర్స్ ఆఫీసర్‌గా చరిత్ర సృష్టించిన ‘గుంజన్ సక్సేనా’ బయోపిక్‌లో నటించే చాన్స్ కొట్టేసింది. ‘గుంజన్ సక్సేనా – ది కార్గిల్ గర్ల్’ పేరుతో తెరకెక్కిన సినిమాలో జాన్వీ టైటిల్ రోల్‌ చేస్తుండగా.. స్వాతంత్ర్య దినోత్సవ కానుకగా ఆగస్ట్ 12న నెట్‌ఫ్లిక్స్‌లో సినిమా రిలీజ్ కానున్నట్లు ప్రకటించింది మూవీ యూనిట్. 1999లో కార్గిల్ వార్‌లో పాల్గొన్న గుంజన్ సక్సేనా.. యుద్ధ సమయంలో ఆదర్శప్రాయమైన ధైర్యాన్ని ప్రదర్శించినందుకు గాను భారత ప్రభుత్వం తనను ‘శౌర్య వీర్’ అవార్డుతో సత్కరించగా.. ఈ రియల్ లైఫ్ క్యారెక్టర్‌లో జాన్వీని చూసేందుకు ఎగ్జయిటింగ్‌గా ఉన్నారు ఫ్యాన్స్.

https://www.instagram.com/p/CCsI_mpAHL9/?utm_source=ig_web_copy_link

శరణ్ శర్మ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమాను.. ధర్మ ప్రొడక్షన్స్, జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించాయి. జాన్వీతో పాటు పంకజ్ త్రిపాఠి, అంగద్ బేడీ, మానవ్ విజ్, వినీత్ కుమార్ సింగ్‌లు ప్రధాన పాత్రల్లో కనిపించబోతున్నారు.


Next Story