- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
శారదక్క బాగున్నావా.. బాగోగులు తెలుసుకున్న గూడూరు సీఐ రాజిరెడ్డి
by Shyam |
<p>దిశ, కొత్తగూడ : ఇటీవల అజ్ఞాత జీవితాన్ని వీడి పోలీసులకు లొంగిపోయిన మాజీ మావోయిస్టు నేత శారదక్క అలియాస్ జెజ్జరి సమ్మక్క నివాసానికి సీఐ రాజిరెడ్డి చేరుకొని ఆమెను పలకరించారు. దాదాపు 30 సంవత్సరాలుగా మావోయిస్టు పార్టీలో కీలక పాత్ర పోషించిన శారదక్క, తన భర్త హరిభూషణ్ మరణానంతరం మానసిక వేదనతో అనారోగ్యానికి గురై లొంగిపోవైయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గూడూరు సీఐ రాజి రెడ్డి ఆమెను కలిసి మాట్లాడారు. ప్రస్తుతం ఆరోగ్యం ఎలా ఉందని […]</p>

X
దిశ, కొత్తగూడ : ఇటీవల అజ్ఞాత జీవితాన్ని వీడి పోలీసులకు లొంగిపోయిన మాజీ మావోయిస్టు నేత శారదక్క అలియాస్ జెజ్జరి సమ్మక్క నివాసానికి సీఐ రాజిరెడ్డి చేరుకొని ఆమెను పలకరించారు. దాదాపు 30 సంవత్సరాలుగా మావోయిస్టు పార్టీలో కీలక పాత్ర పోషించిన శారదక్క, తన భర్త హరిభూషణ్ మరణానంతరం మానసిక వేదనతో అనారోగ్యానికి గురై లొంగిపోవైయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గూడూరు సీఐ రాజి రెడ్డి ఆమెను కలిసి మాట్లాడారు.
ప్రస్తుతం ఆరోగ్యం ఎలా ఉందని వాకబు చేశారు. వైద్య పరంగా కావలసిన ఏర్పాట్లు చేస్తామని ఆమెకు భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా తల్లిదండ్రులు, బంధువులను విడిచి ఆజ్ఞాతంలో ఉన్న వారు జనజీవన స్రవంతిలో కలిసేందుకు పిలుపునివ్వాలని శారదక్కను కోరారు. శారదక్కను కలిసిన వారిలో కొత్తగూడ ఎస్సై సురేష్, పోలీసు సిబ్బంది ఉన్నారు.
Next Story






