- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పెళ్లి కొడుకు ఆనందం.. నిమిషాల్లోనే ఆవిరి!
<p>దిశ, వెబ్ డెస్క్: ఏపీలో కరోనా వైరస్ విస్తృతంగా వ్యాప్తిచెందుతోంది. రోజురోజుకూ పాజిటివ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతూ, విలయతాండవం చేస్తోంది. పోలీసులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, డాక్టర్లు ఎవరినీ వదలకుండా అందరికీ సోకి అతలాకుతలం చేస్తోంది. తాజాగా కడప జిల్లా ఒంటిమిట్ట మండలం కొత్తమాధవరంలో అప్పుడే పెళ్లి చేసుకున్న వరుడికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. పెళ్లి అయిన కొన్ని గంటల వ్యవధిలోనే విషయం తెలియడంతో పెళ్లికి వచ్చిన వారంతా తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. విషయం తెలిసిన […]</p>

దిశ, వెబ్ డెస్క్: ఏపీలో కరోనా వైరస్ విస్తృతంగా వ్యాప్తిచెందుతోంది. రోజురోజుకూ పాజిటివ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతూ, విలయతాండవం చేస్తోంది. పోలీసులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, డాక్టర్లు ఎవరినీ వదలకుండా అందరికీ సోకి అతలాకుతలం చేస్తోంది. తాజాగా కడప జిల్లా ఒంటిమిట్ట మండలం కొత్తమాధవరంలో అప్పుడే పెళ్లి చేసుకున్న వరుడికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. పెళ్లి అయిన కొన్ని గంటల వ్యవధిలోనే విషయం తెలియడంతో పెళ్లికి వచ్చిన వారంతా తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. విషయం తెలిసిన అధికారులు పెళ్లికి హాజరైన వారికి కూడా కరోనా పరీక్షలు చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో అత్తగారి ఇంట్లో ఉన్న పెళ్లికొడుకొని కడపలోని కొవిడ్ ఆస్పత్రికి తరలించారు. వివాహనికి ఏ ప్రాంతం నుంచి ఎంత మంది హాజరయ్యారని పోలీసులు, వైద్య సిబ్బంది ఆరా తీస్తున్నారు. ఇప్పటికే 46 మందిని గుర్తించినట్టు అధికారులు తెలిపారు. వీరికి కూడా పరీక్షలు నిర్వహించనున్నారు.






