తాళి కట్టడానికి ముందే ఆ పని చేసిన వరుడు.. షాకిచ్చిన వధువు

by  |
తాళి కట్టడానికి ముందే ఆ పని చేసిన వరుడు.. షాకిచ్చిన వధువు
X

దిశ, వెబ్‌డెస్క్ : పెళ్లి అనేది స్వర్గంలో నిర్ణయించబడుతుంది అంటారు. ఇక ఒక అమ్మాయి తన కన్నవారిని విడిచి తన భర్త మీద నమ్మకంతో అత్తవారింటిలో అడుగు పెడుతోంది. ప్రస్తుతం జనరేషన్‌లో అబ్బాయిలతో సరిసమానంగా అమ్మాయిలు ఉద్యోగాలు చేస్తున్నారు. అందువలన ఆడపిల్లలు చాలా రిస్ట్రిక్షన్స్ పెడుతున్నారు. అబ్బాయికి ఏ దురలవాట్లు లేకుంటనే అమ్మాయిలు పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడుతున్నారు. అయితే తమిళనాడులో విచిత్ర ఘటన చోటు చేసుకుంది. ఏ దురలవాట్ల లేవని చెప్పడంతో పెళ్లికి ఒప్పుకున్న అమ్మాయికి పెళ్లి కొడుకు షాకిచ్చాడు.

వివరాల్లోకి వెళ్లితే.. శరవణ్ అనే వ్యక్తి తిరువణ్ణామలై అనే వ్యక్తితో పెద్దలు పెళ్లి నిశ్చయించారు. పెళ్లికి ముందే వీరు అన్ని మాట్లాడుకున్నారు. పెళ్లి వరునికి ఏ దురలవాట్లు లేవు, బుద్ధీగా పని చేసుకుంటాడని చెప్పడంతో ఎంతో సంతోషంగా అమ్మాయి తరఫున వారు అబ్బాయికి తమ అమ్మాయిని ఇవ్వడానికి ఒప్పుకున్నారు. ఇక మద్యం సేవించని అబ్బాయి అంటే ఇష్టపడని అమ్మాయి ఉంటుందా.. మద్యం సేవించడు అని తెలియడంతో అమ్మాయి కూడా వెంటనే పెళ్లికి ఒకే చెప్పింది. దీంతో వీరికి ఈ నెల 9వతేదీ శుక్రవారం ముహుర్తం ఫిక్స్ చేశారు పెద్దలు. కాగా అనుకున్న సమయానికి పెళ్లి కూతురు తరఫున బంధువులు, తన స్నేహితులందరూ కళ్యాణ మండపంకు చేరకున్నారు. కానీ ఎంత సేపు ఎదురు చూసిన పెళ్లికొడుకు తరఫున వారు పెళ్లి మండపానికి రావడంలేదు. ఫొన్ చేసిన రెస్పాండ్ లేక పోవడంతో ఏకంగా పెళ్లి కూతురును తీసుకొని వధువు బంధువులు వరుడు ఇంటికి వెళ్లడంతో ఒక్కసారిగా షాక్ అయ్యారు.

ఇంతకీ అక్కడ ఏం జరిగింది అనుకుంటున్నారా.. పెళ్లికొడుకు పెళ్లి రోజే ఫుల్‌గా తాగి సోయి లేకుండా బొక్కబోర్ల ఇంట్లో పడుకొని పొర్లుతున్నాడు. దాన్ని చూసిన పెళ్లికూతురు, ఆమె బంధువులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఇక ఈ పెళ్లి వద్దు ఆ పిలగాడు వద్దు అంటూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. కొంత తెలివిలోకి వచ్చిన పెళ్లికొడుకు బతిమిలాడినా ఫలితం లేకుండా పోయింది. ఇక ఎన్నో ఆశలతో ఒకటవుదాము అనుకున్న ఆ జంట సింగిల్‌గానే మిగిలిపోయింది.


Next Story

Most Viewed