మేయర్ ఎన్నికకు నోటిఫికేషన్ రిలీజ్..

by  |
మేయర్ ఎన్నికకు నోటిఫికేషన్ రిలీజ్..
X

దిశ, వెబ్‌డెస్క్ : గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ఎన్నికకు శుక్రవారం నోటిఫికేషన్ వెలువడింది. ఫిబ్రవరి 11న జీహెచ్ఎంసీకి కొత్త మేయర్ ఎన్నిక జరగనుంది. ఈ నేపథ్యంలోనే మేయర్ ఎన్నికకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఫిబ్రవరి 11వ తేదీ ఉదయం 11గంటలకు కార్పొరేటర్లు ప్రమాణ స్వీకారం ఉండనుందని, అదే రోజు మధ్యాహ్నం 12.30కు జీహెచ్ఎంసీ మేయర్ ఎన్నిక ప్రక్రియ కొనసాగనుంది. ఆ తర్వాత డిప్యూటీ మేయర్‌ను ఎన్నుకోనున్నారు.

Next Story

Most Viewed